uppula Raju |
Updated on: Jun 02, 2022 | 5:15 PM
ప్రయాణంలో ఏదైనా ఆహారం రుచిగా అనిపిస్తే ఇష్టంగా లాగించేస్తారు. తర్వాత మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరంతో బాధపడుతారు. ఈ పరిస్థితిలో కొన్ని చిట్కాలని పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
జీలకర్ర నీరు: తరచుగా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు చెంచా జీలకర్ర తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి గ్యాస్‌పై మరిగించాలి. అందులో ఇంగువ, నల్ల ఉప్పు వేయాలి. ఈ నీరు చల్లబడిన తర్వాత, సిప్-సిప్‌గా తాగాలి.
హైడ్రేటెడ్‌గా ఉండండి: మీరు ప్రయాణిస్తున్నప్పుడు, మలబద్ధకం లేదా ఉబ్బరం మిమ్మల్ని ఇబ్బంది పెడితే కొద్ది కొద్దిగా నీరు తాగుతూ ఉండండి. అంతే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
గ్రీన్ టీ తాగండి: ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి గ్రీన్ టీ తాగుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున గ్రీన్ టీ తాగితే పొట్టకి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.
ఉసిరికాయ మిఠాయి: మీరు రోజూ ఉసిరికాయ మిఠాయిని తినాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు బ్యాగ్‌లో మెయింటెన్ చేయాలి. కడుపు ఉబ్బరం అనిపించినప్పుడల్లా తింటే ఉపశమనం ఉంటుంది.