- Telugu News Photo Gallery Technology photos Redmi launches new budget smartphone Redmi 11 5g price and features
Redmi 11 5g: రూ. 14వేలలో 50 మెగాపిక్సెల్స్ కెమెరా.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు మరెన్నో ఫీచర్లు..
Redmi 11: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ 10 సిరీస్‌కు కొనసాగింపుగా రెడ్‌మీ 11 ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి రానుంది...
Updated on: Jun 02, 2022 | 5:08 PM

వరుసగా సరికొత్త స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న రెడ్‌మీ తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ 11 పేరుతో రానున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

రెడ్‌మీ 11 స్మార్ట్ ఫోన్‌లో 6.58 ఇంచెస్ ఫుల్ హెడ్‌డీ+డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్క్రీన్ 90హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో రానుంది.

మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో రానున్న ఈ ఫోన్‌లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 13,999కి అందుబాటులో ఉండనుంది.




