Immunity Boosters: మీ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసే 4 మసాలా దినుసులివే.. వాడితే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టినట్లే..

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Jan 27, 2023 | 6:35 PM

శీతాకాలంలో జలబు, దగ్గు, జ్వరం వంటి అనేక సీజనల్ వ్యాధులు మనల్ని వేధిస్తుంటాయి. వాటికి కారణం మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగైన స్థితిలో లేకపోవడమే కారణం అని చెప్పుకోవాలి. మరి ఆ శక్తిని పటిష్టం చేసుకునేందుకు మన వంటిగదిలోనే ఉండే కొన్ని రకాల మసాలా దినుసులు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి అవేమిటో వాటిని ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Jan 27, 2023 | 6:35 PM
Immunity

Immunity

1 / 6
Indian Spices

Indian Spices

2 / 6
 పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి పసుపును పాలతో కలిపి తీసుకోవచ్చు.

3 / 6
మెంతి ఆకుల పొడి: మెంతులు మన ఆహారం రుచిని పెంచడానికి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని పనీర్ లేదా ఏదైనా ఇతర కూరగాయలకు జోడించవచ్చు.

4 / 6
 జీలకర్ర పొడి:  జీలకర్ర పొడిని సాధారణంగా కూరలలో ఉపయోగిస్తారు. కానీ శరీర రోగనిరోధక శక్తిని పెంచడం కోసం కూడా మీరు దీనిని ఉపయోగించవచ్చు. అందుకోసం మీరు ఒక గ్లాసు నీటిలో జీలకర్ర పొడిని వేసుకుని తాగితే సరి. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కూడా కలిగేలా చేస్తుంది.

5 / 6
ధనియాల పొడి: నిత్యం వంటలలో ఉపయోగించే ధనియాల పొడి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడడంతో పాటు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

6 / 6

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu