Hair Care: పట్టులాంటి మెరిసే జట్టు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? కలబందతో ఇలా ట్రై చేయండి..

శీతాకాలంలో వెంట్రుకలు తరచుగా పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంటాయి . ఈక్రమంలో పొడి జుట్టును వదిలించుకోవడానికి, అలాగే మెరిసేలా చేయడానికి మీరు సహజ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.

Hair Care: పట్టులాంటి మెరిసే జట్టు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? కలబందతో ఇలా ట్రై చేయండి..
Hair Care
Follow us

|

Updated on: Jan 22, 2023 | 7:58 AM

ఒత్తైన, దృఢమైన, పట్టులా మెరిసే జుట్టును ఎవరు కాదనుకుంటారు? ఆరోగ్యకరమైన కురుల కోసం ఒక్కొక్కరు ఒక్కోరకమైన పద్ధతులను అవలంభిస్తారు. కొందరు హెయిర్ ట్రీట్‌మెంట్ కోసం సెలూన్‌కి కూడా వెళతారు. అలాగే మార్కెట్లలో దొరికే కాస్మోటిక్స్‌ను కూడా విరివిగా వాడతారు. అయితే వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలియదు కానీ ఇందులోని రసాయనాలు శిరోజాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే సహజ సిద్ధమైన పద్ధతులనే అవలంభించాలంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా శీతాకాలంలో వెంట్రుకలు తరచుగా పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంటాయి . ఈక్రమంలో పొడి జుట్టును వదిలించుకోవడానికి, అలాగే మెరిసేలా చేయడానికి మీరు సహజ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.  కలబంద జుట్టు సంరక్షణలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తుంది. ఇందుకు కావలసినవి – అలోవెరా, 2 నుండి 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 1 విటమిన్ ఇ క్యాప్సూల్

ఎలా ఉపయోగించాలంటే?

– జుట్టు నునుపుగా, మెరిసేలా చేయడానికి అలోవెరా జెల్‌ను ఒక గిన్నెలో తీయండి.

– తర్వాత దానికి దాదాపు 2 నుంచి 4 టీస్పూన్ల కొబ్బరి నూనెను కలపాలి

ఇవి కూడా చదవండి

– తర్వాత దానికి 1 క్యాప్సూల్ విటమిన్-ఇ కలపండి. ఈ మూడు పదార్థాలను బాగా కలపండి.

– దీని తర్వాత, ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ నుండి జుట్టు చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయండి.

– ఇందుకోసం బ్రష్‌ను కూడా ఉపయోగించవచ్చు.

– సుమారు 20 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో తలస్నానం చేస్తే సరి.

అలోవెరా ప్రయోజనాలు

కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణను అందిస్తాయి. ఇది స్కాల్ప్ డ్రైనెస్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు స్కాల్ప్ లోతైన శుభ్రత కోసం కలబంద చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొబ్బరి నూనె ప్రయోజనాలు

కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి జుట్టుకు మాయిశ్చరైజింగ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్య నుంచి జుట్టును రక్షిస్తాయి. జుట్టు నిగనిగలాడేందుకు కొబ్బరి నూనెను కూడా ఉపయోగిస్తారు.

విటమిన్ ఇ ప్రయోజనాలు

విటమిన్ ఇలో ఉండే పదార్థాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో బాగా సహాయపడుతాయి. అలాగే స్కాల్ప్‌, హెయిర్ పోషణలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??