AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Hair Fall: మహిళల్లోనూ బట్టతల.. ఇంటి చిట్కాలతో ఒత్తైన జుట్టు మీ సొంతం..

ముఖ్యంగా జీవనశైలిలో చేసుకునే చిన్నపాటి మార్పుల వల్ల హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఒత్తిడిని జయిస్తే జుట్టు రాలే సమస్యను చాలా వరకూ బయటపడవచ్చు. మగవారితో పోలిస్తే ఆడవారికి ఇంటి పనుల విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. దీంతో వారు జుట్టు రాలే సమస్యతో బాధపడతారు.

Women Hair Fall: మహిళల్లోనూ బట్టతల.. ఇంటి చిట్కాలతో ఒత్తైన జుట్టు మీ సొంతం..
Hair Falling
Nikhil
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 20, 2023 | 1:21 PM

Share

జుట్టు రాలడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. అలాగే మానసిక ఒత్తిడికి గురి కావచ్చు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. కుటుంబ చరిత్ర, ఒత్తిడి, సరిపడా పోషణ, చెమట, అనారోగ్యం, వయస్సు, చికిత్సలు లేదా మందులు, హార్మోన్లలో మార్పులు వంటి చాలా సమస్యలు హెయిర్ ఫాల్ సమస్యకు కారణమవుతాయి. కొన్ని కారణాల వల్ల జుట్టు రాలిపోతే మన ఏం చేయలేము కానీ కొన్ని మాత్రం మన నియంత్రణలోనే ఉంటాయి. ముఖ్యంగా జీవనశైలిలో చేసుకునే చిన్నపాటి మార్పుల వల్ల హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఒత్తిడిని జయిస్తే జుట్టు రాలే సమస్యను చాలా వరకూ బయటపడవచ్చు. మగవారితో పోలిస్తే ఆడవారికి ఇంటి పనుల విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. దీంతో వారు జుట్టు రాలే సమస్యతో బాధపడతారు. అయితే సహజమైన చికిత్సలతో సమస్యను పరిష్కరించకుండా చాలా పెద్ద చర్యలతో ఎందుకు ఇబ్బంది పడాలి? ప్రత్యేకించి ఆడవారిలో జుట్టు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వైద్యులు ఏం సూచినలు చేస్తున్నారో? ఓసారి తెలుసుకుందాం.

ఆహార మార్పులు

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే సరైన ఆహారాన్ని ప్రతి రోజూ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని డైటీషియన్‌ సలహాతో తీసుకోవాలి. నాణ్యమైన మల్టీ-విటమిన్‌ ఆహారాన్ని రోజూ తీసుకోవడం వల్ల మీ పోషకాహార స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ చర్యలు జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగాఆహారంలో చేపలు, మాంసం, పప్పులు వంటి వాటిని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఆయిల్ మసాజ్

మంచి ఆయిల్ మసాజ్ జుట్టు రాలడాన్ని నయం చేస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేద చికిత్సలో ఉపయోగించే భృంగరాజ్ నూనెతో మాసాజ్ చేస్తే ఆశ్చర్యకర ఫలితాలు చూస్తారు. చుండ్రు, పొడి స్కాల్ప్ చికిత్సకు, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, రక్త ప్రసరణను పెంచడానికి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ నూనెను కొద్దిగా వేడి చేసి తలకు అప్లై చేసిన తర్వాత 30 నిమిషాలు ఉంచుకుని తలస్నానం చేయాలి. ఈ నూనె వాడితో మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే రోజ్మేరీ, లావెండర్, జునిపెర్, పెప్పర్‌మింట్, లెమన్‌గ్రాస్, టీ ట్రీ వంటి నూనెల్లో ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఎలాంటి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి ఇవి సహాయపడతాయి. అలాగే ఈ నేచురల్ ఆయిల్స్ తో మసాజ్ చేయడం వల్ల చిన్న వయసులోనే జుట్టు రాలిపోకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్టైలింగ్ ఉత్పత్తుల్లో జాగ్రత్తలు

రంగులు, స్టైలింగ్ ఉత్పత్తు ఉండే విషపూరిత రసాయనాల కారణంగా జుట్టు ఊడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జుట్టు స్టైలింగ్ ఉత్పత్తులను తెలివిగా ఎంచుకోవాలి. నిపుణుల సూచనతో స్టైలింగ్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. అలాగే శీతాకాలంలో మీ జుట్టును మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే జుట్టుకు తేమను అందించడానికి అరటిపండును పాలు లేదా క్రీమ్‌తో కలపడం ద్వారా ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌లను ఉపయోగించడం ఉత్తమం.

ఉసిరి

ఉసిరి జుట్టు పల్చబడడాన్ని ఎదుర్కోంటుంది. అలాగే మీ జుట్టును షాంపూ చేయడానికి ఉసిరి పొడిని వాడితే చాలా మంచిది. జుట్టుకు ఆమ్లా ప్రయోజనాలను అందించడానికి ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. 

అలోవెరా

అలోవెరా చాలా కాలంగా జుట్టు రాలడం, జుట్టు పల్చబడటానికి చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. ఇది స్కాల్ప్, కండిషన్స్ హెయిర్‌ని కూడా శాంతపరుస్తుంది. ఇది చుండ్రును తగ్గిస్తుంది. స్వచ్ఛమైన కలబంద జెల్‌ను మీ తలకు వారానికి కొన్ని సార్లు అప్లై చేస్తే జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.  అలాగే కలబందను ఉన్న షాంపూ లేదా కండీషనర్‌ను వాడినా ఉత్తమ ఫలితాలు వస్తాయి. 

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే ప్యాచీ అలోపేసియా అరేటాను విజయవంతంగా చికిత్స చేస్తుంది. వెంట్రుకల కుదుళ్లను రక్షించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ప్రతి రోజు కొన్ని ఉల్లిపాయలను మిక్సీలు వేసి ఓ గుడ్డలో వచ్చిన పేస్ట్ ను వేసి రసం పిండి తలకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునన 15 నిమిషాల వరకూ ఉంచి అనంతరం షాంపూతో కడగాలి. తద్వారా ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..