Fenugreek for Health: మెంతులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను మన వంటగదిలో ఉండే మసాలా దినుసులను ఉపయోగించే ఇట్టే నయం చేయవచ్చు. మన పూర్వీకులు ఎంతో ముందుచూపుతోనే ఆయుర్వేదంలోనూ, ఆహారంలోనూ ఉపయోగపడే మసాలా దినుసులను..

Fenugreek for Health: మెంతులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Fenugreek Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 20, 2023 | 12:16 PM

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను మన వంటగదిలో ఉండే మసాలా దినుసులను ఉపయోగించే ఇట్టే నయం చేయవచ్చు. మన పూర్వీకులు ఎంతో ముందుచూపుతోనే ఆయుర్వేదంలోనూ, ఆహారంలోనూ ఉపయోగపడే మసాలా దినుసులను మన వంటింటిలోకి చేర్చిపెట్టారు. వంట గదిలో ఉండే ఒక్కో మసాల దినుసులో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో, అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను కల్పించడంలో సమర్థవంతంగా పనిచస్తాయి. మరి అలాంటి వాటిలో మెంతులు కూడా ఒకటి. సాధారణంగా మెంతి ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తారు. అలాగే ఇతరత్రా వంటలలోనూ మెంతులను ఉపయోగిస్తుంటారు మన భారతీయ స్త్రీలు. ఇక మెంతి పొడిని అయితే ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతారు. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో అనేక రకాల ఔషధగుణాలనున్నాయి.

అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యింది. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చేదు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. మరి ఈ క్రమంలో మెంతుల వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపు చేసేందుకు ఇవి దోహదపడతాయి.
  2. మెంతులు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను క్రమ‌బ‌ద్దీక‌రిస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారికి మెంతులు దివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి.
  3. అజీర్తి, క‌డుపుబ్బరం సమస్యలను కూడా మెంతులు త‌గ్గిస్తాయి. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యం లేవ‌గానే ప‌రిగ‌డుపున ఆ నీళ్లను తాగాలి. ఇలా చేయడం వల్ల అజీర్తి స‌మ‌స్య తొల‌గిపోతుంది.
  4. మెంతుల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది. దాంతో మ‌నం మోతాదుకు మించిన ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. ఆహారం మితంగా తీసుకోవడంవల్ల ఒంట్లో కొవ్వు క‌రుగుతుంది. కాబ‌ట్టి స్థూల‌కాయుల‌కు కూడా మెంతులు నిత్యావ‌స‌రం.
  5. మెంతి గింజ‌ల‌ను పెనం మీద వేయించి, మెత్తగా దంచి పెట్టుకోవాలి. రోజూ ఉద‌యాన్నే ఆ పొడిని వేడి నీటిలో క‌లుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం దొరుకుతుంది. ఈ పొడిని కూర‌ల్లో కూడా వాడుకోవ‌చ్చు.
  6. ఒక చెంచా మెంతుల‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవ‌డంవ‌ల్ల కూడా జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది. విరేచ‌నాలు త‌గ్గడానికి కూడా మెంతులు తోడ్పడుతాయి.
ఇవి కూడా చదవండి