AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Aging Tips: వయసు పెరగినా యంగ్‌గా కనిపించాలంటే.. తీసుకోవలసిన ఆహారాలివే.. తింటే మెరిసే చర్మం కూడా..

మన వయసు పెరుగుతున్న కొద్దీ దాని ప్రభావం మన చర్మంపై కనిపించడం సాధారణమైన విషయం. చర్మంపై కనిపించే ముడతలు, గీతలు మెల్లగా వృద్ధులు అవుతున్నామని సూచిస్తాయి. మానవ జీవన క్రమంలో వృద్ధాప్యం అనేది ఎవరూ..

Anti Aging Tips: వయసు పెరగినా యంగ్‌గా కనిపించాలంటే.. తీసుకోవలసిన ఆహారాలివే.. తింటే మెరిసే చర్మం కూడా..
Anti Aging Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 20, 2023 | 9:59 AM

Share

మన వయసు పెరుగుతున్న కొద్దీ దాని ప్రభావం మన చర్మంపై కనిపించడం సాధారణమైన విషయం. చర్మంపై కనిపించే ముడతలు, గీతలు మెల్లగా వృద్ధులు అవుతున్నామని సూచిస్తాయి. మానవ జీవన క్రమంలో వృద్ధాప్యం అనేది ఎవరూ ఆపలేని సహజ ప్రక్రియ.  అయితే చర్మ సంరక్షణలో భాగంగా కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా చర్మంపై వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా చేయవచ్చు. చర్మంపై కనిపించే ముడతల సమస్యను వదిలించుకోవడానికి కెరాటిన్ చాలా ముఖ్యమైనదిగా డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు. కెరాటిన్ మన చర్మం, జుట్టు, గోళ్ళలో ఉంటుంది. చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉండే ఇది ఒక రకమైన ప్రోటీన్. శరీరంలోకి ఎలాంటి ఇన్ఫెక్షన్‌ ప్రవేశించకుండా నివారించడమే కాక చర్మంపై ముడతలు కనిపించకుండా చేస్తుంది. అందుకోసం కెరాటిన్ సమృద్ధిగా లభించే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే చక్కని ఫలితాలు ఉంటాయి. మరి కెరాటిన్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. బొప్పాయి : బొప్పాయిలో చర్మానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉండడంతో చర్మ సంరక్షణ కోసం దీనిని నిత్యం తినడం మంచిది. బొప్పాయిలో యాంటీ ఏజింగ్‌ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరానికి అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మం ఆరోగ్యంగా మిలమిలలాడుతుంది. అంతేకాక అనేకరకాల చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బొప్పాయి గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వాడటం వల్ల కూడా ముఖం కాంతివంతంగా మారుతుంది.
  2. ఆకు కూరలు: ఆకు కూరల్లో క్లోరోఫిల్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా, కళ్లు మెరుపులీనుతూ ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆకుకూరల వాడకం వల్ల ఏ లోపం లేకుండా శరీరానికి సమృద్ధిగా విటమిన్లు అందుతాయి. అంతేగాక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి.
  3. పాలు, బాదం: పాలలో ఉండే పోషకాల గురించి చిన్నప్పటి నుంచి వింటున్నదే కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక బాదం పప్పును ఏ విధంగా తీసుకున్నా అందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి . అందువల్ల రోజూ గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది. లేదా పాలలో బాదం పప్పులను నానబెట్టి తీసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి.
  4. దానిమ్మ: ప్రతిరోజూ దానిమ్మను తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని నియంత్రించవచ్చు. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఆహారంలో దానిమ్మను వినియోగించాలి. దానిమ్మ రసాన్ని తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. షుగర్‌ ఉన్న వారు కూడా దానిమ్మను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. పెరుగు: శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్‌ అధిక పరిమాణంలో లభించాలంటే ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. పెరుగును ఫేస్‌ ప్యాక్‌గా కూడా వాడచ్చు. ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే చర్మంపై ముడతలు తొలగిపోవడంతో పాటు దానిపై రంధ్రాలు, మచ్చలు లేకుండా ముఖచర్మం మృదువుగా తయారవుతుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచి పెరుగు తినే అలవాటు చేయడం మంచిది.
  7. క్యారెట్:  విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి-8, పాంతోతేనిక్ యాసిడ్, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి పలు పోషకాలు క్యారెట్‌ ద్వారా లభిస్తాయి. క్యారెట్‌లో చాలా ఫైబర్, బీటా కెరోటిన్ లభిస్తాయి. ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని సరిచేయడంలో కూడా క్యారెట్లోని పోషకాలు సహాయపడుతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..