Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajwain Leaves: చిన్నపిల్లలు ఉన్నవారు తప్పనిసరిగా పెంచుకోవలసిన మొక్క ఇది.. దీని ప్రయోజనాలు అలాంటివి మరి.. అవేమిటంటే..

భారతీయుల వంటిల్లే అనేక ఔషధాలకు గని వంటది. పోపుల పెట్టెలోని ఎన్నో పదార్ధాలు ఆరోగ్య సమస్యలను నివారించడే కాక పలు విధాలైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇక ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు వాము గింజలు అయితే..

Ajwain Leaves: చిన్నపిల్లలు ఉన్నవారు తప్పనిసరిగా పెంచుకోవలసిన మొక్క ఇది.. దీని ప్రయోజనాలు అలాంటివి మరి.. అవేమిటంటే..
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 19, 2023 | 10:13 AM

భారతీయుల వంటిల్లే అనేక ఔషధాలకు గని వంటది. పోపుల పెట్టెలోని ఎన్నో పదార్ధాలు ఆరోగ్య సమస్యలను నివారించడే కాక పలు విధాలైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇక ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు వాము గింజలు అయితే.. ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వాము కూడా ఒకటి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు ఈ వాము మొక్కలు పెంచుకోవడంతో ఎన్నో ప్రొబ్లెమ్స్ నుంచి ఈజీగా బయటపడతారు. ఇక వాము గింజలను వంటకాలతో పాటు పలురకాల పానీయాలు తయారీకోసం ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనను అందిస్తుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు అంతే మేలు చేస్తాయి.

అందుకనే కనీసం మూడు నెలలకు ఒక్కసారి అయినా వాము పొడి కాని వాము ఆకు కాని వాడితే కడుపు సమస్యలు తొలగిపోవడంతో పాటు అది శుభ్రపడుతుంది. వాము ఆకు అప్పుడప్పుడు వాడినా ఆరోగ్యానికి చాలా మంచిదేనని ఆయుర్వేద నిపుణులు చెప్పారు. ఈ వామకులో అనేక విశిష్ట లక్షణాలు ఉన్నాయి. మరి వాము ఆకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి
  1. చిన్న పిల్లలకు అజీర్తితో కడుపునొప్పి నివారణకు వాము ఆకు మంచి ఔషధం. వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్న పిల్లలకు ఇస్తే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక తరచుగా చిన్న పిల్లలు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి వాటితో ఇబ్బంది పడుతుంటే.. వాటి నుంచి ఉపశమనం కోసం వాము ఆకు నీరు మంచి మెడిసిన్.
  2. కాలిన గాయాలు, మచ్చలను వాము తగ్గిస్తుంది. దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
  3. వాము ఆకు తలనొప్పి తగ్గించడంలో ఔషధంగా పనిచేస్తుంది. వాము ఆకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది.
  4. ఏవైనా పురుగులు శరీరంపై కుడితే వాటిపై వాము ఆకును రుద్దాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషం బయటకు వస్తుంది.
  5. వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  6. వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కటి పరిష్కారం.
  7. వాము ఆకును ఔషధంగానే కాదు ఆహారపదార్ధాల్లో కూడా ఉపయోగించవచ్చు. వాము ఆకుతో బజ్జీలు వేసుకొని తినవచ్చు.
  8. వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండడంతో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి.
  9. వాము ఆకు రసం కూడా పెట్టుకోవచ్చు.ప్రతి ఇంటి పెరట్లో వాము మొక్క ఉంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..