Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crying Benefits: ఏడవడం వల్ల కలిగే ఉపయోగాలేమిటో తెలిస్తే.. ఎవరైనా ఎడవకుండా ఉండలేరు.. ఎందుకంటే..

నవ్వు నాలుగు విధాల మేలు అని కూడా మన పెద్దలు చెబుతుంటారు. అయితే నవ్వే కాదు ఏడుపు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాక నవ్వక పోవడం రోగమే కానీ..

Crying Benefits: ఏడవడం వల్ల కలిగే ఉపయోగాలేమిటో తెలిస్తే.. ఎవరైనా ఎడవకుండా ఉండలేరు.. ఎందుకంటే..
Crying Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 19, 2023 | 8:57 AM

‘నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం’ అన్నారు మన పూర్వీకులు. అలాగే నవ్వు నాలుగు విధాల మేలు అని కూడా మన పెద్దలు చెబుతుంటారు. అయితే నవ్వే కాదు ఏడుపు కూడా ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాక నవ్వక పోవడం రోగమే కానీ.. ఏడ్వడం మాత్రం రోగం కాదని చెబుతున్నారు నిపుణులు. అయితే మనం బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం సహజం. ఎవరైన సరే మరింత సంతోషంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కన్నీళ్లు వస్తుంటాయి. వీటిని ఆనంద భాష్పాలు అంటారు. ఇక మనసులోని భావోద్వేగాలను అధిగమించలేకపోయినప్పుడు అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఇవి కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరమే. ఈ క్రమంలో ఏడవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఏడుపు మన శీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బాధ పడడం కంటే కన్నీరు వచ్చేలా ఏడ్వడం వల్లే ఎక్కువ ప్రయోజం ఉంటుందని వారు అంటున్నారు. కన్నీరులో 98 శాతం నీరు, మిగిలన 2 శాతంలో హార్మోన్లు, టాక్సిన్స్‌ ఉంటాయి. కన్నీటి ద్వారా శరీరం నుంచి అనేక విష పదార్థాలు విడుదలవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
  2. ఏడ్వడం వల్ల మనసు తేలిక పడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. బాధతో భారంగా మారిన మనసు ఏడిస్తే తేలికగా మారుతుందని మానసిక నిపుణుల సూచన. చాలా మంది మనస్ఫూర్తిగా ఏడ్చిన తర్వాత కొత్త ఉత్సాహాన్ని పొందుతారని చెబుతున్నారు.
  3. అప్పుడప్పుడు ఏడ్వడం వల్ల కళ్లు పొరిబారడం అనే సమస్యను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఐ లేదా డ్రై ఐ గ్లాండ్స్‌తో బాధపడేరికి ఏడుపు మంచి ఔధంగా చెబుతున్నారు.
  4. కొన్ని పరిశోధనల ప్రకారం బరువు తగ్గడంలో వ్యాయామం, డైట్‌తో పాటు ఏడుపు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందంటా. ఏడిచే సమయంలో శరీరంలో అధిక క్యాలరీలు ఖర్చు కావడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు
  5. ఇవి కూడా చదవండి
  6. ఏడుపు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనసులో అనవసరగా బాధలు పెట్టుకొని కుంగిపోయే కంటే మనసారా ఏడ్చేసి తృప్తిగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..