AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Consuming: టీతో ఈ ఫుడ్స్ తిన్నారో? అంతే.. మీ ఆరోగ్యం ఫసక్..

నిపుణులు సలహా ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను టీ తో పాటు అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను టీ ను కలిపి తాగడం వల్ల జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Tea Consuming: టీతో ఈ ఫుడ్స్ తిన్నారో? అంతే.. మీ ఆరోగ్యం ఫసక్..
Tea
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 19, 2023 | 9:57 AM

Share

భారత్ లో టీ ను చాలా మంది ఇష్టపడతారు. టీ తాగడం అనేది రోజు వారి దినచర్యలో ఓ భాగం అయిపోయింది. ఉదయాన్నే లేచిన వెంటనే  టిఫిన్ చేేసే ముందు గానీ తర్వాత గానీ టీ తాగడం అనేది కామన్. అలాగే మధ్యాహ్నం స్నాక్స్ తినే సమయంలో కూడా టీ అనేది కంపల్సరీ తాగుతారు. పకోడా, సమోసా ఏదైనా స్నాక్ తో టీ తాగడం అనేది రోటీన్ చర్యగా మారింది. నిపుణులు సలహా ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను టీ తో పాటు అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను టీ ను కలిపి తాగడం వల్ల జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే పోషకాలను శరీరీం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. టీ తో పాటు తినకూడని ఆహార పదర్థాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

టీతో తినకూడని ఐదు ఆహార పదార్థాలు

గ్రీన్ వెజిటేబుల్స్

ఐరన్ అధికంగా ఉండే ఆకు కూరలు, కూరగాయలు టీతో అస్సలు తినకూడదు. ఎందుకంటే టీలో టానిన్లు, ఆక్సిలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో శోషణను నిరోధిస్తాయి. కాబట్టి శరీరంలో ఐరన్ ను శోషించాలంటే ఆకుపచ్చ కూరగాయలతో టీ ను తీసుకోవడం నుంచి దూరంగా ఉండాలి. 

ఫ్రూట్ సలాడ్

చాయ్ వేడిగా ఉంటుంది. దాన్ని తినే సమయంలో శరీరంలో అన్నవాహిక అన్నీ వేడిపరుస్తాయి. ఇదే సమయంలో చల్లని, పచ్చి ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. పండ్లల్లో అధిక పోషకాలు ఉంటాయి. వీటితో పాటు టీ లేదా కాఫీ తాగితే ఎసిడిటీ వస్తుంది. తాజా పండ్లు, ఫ్రూట్ సలాడ్ ను తినే టైమ్ లో కచ్చితంగా టీను అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

నిమ్మరసం

నిమ్మరసాన్ని కచ్చితంగా లెమన్ టీలో కానీ, బ్లాక్ టీ లో కానీ కచ్చితంగా కలుపుతారు. దీన్ని బరువు తగ్గించే ఔషధంగా పరిగణిస్తారు. కానీ నిపుణులు మాత్రం వేడి నీటితో నిమ్మరసాన్ని కలపడంతో యాసిడ్ స్థాయిలను పెరుగుతాయి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేడి వాటితో నిమ్మరసం కలపవద్దని సూచిస్తున్నారు.

పసుపు

భారతీయ వంటకాల్లో కచ్చితంగా పసుపును వినియోగిస్తారు. చాయ్ లేదా పాలల్లో పసుపును వేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ చేస్తాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. అలాగే టీ టానిన్ ఉంటుంది. ఈ రెండింటి కలయిక ఆమ్లత్వం, మలబద్ధకం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణమవుతుంది. 

పెరుగు

పెరుగు అనేది చల్లటి ఆహార పదార్థానికి ఓ చక్కటి ఉదాహరణ. టీ, కాఫీ, బాదం, జీడిపప్పు వంటి వాటితో పెరుగును కలిపి తీసుకుంటే శరీరానికి చాలా హానికరం. కాబట్టి టీతో పెరుగును కలిపి తీసుకోవడం మానుకోవాలి. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి