Weight Loss: వేలాడే పొట్ట వేధిస్తుందా? ఈ జ్యూస్ తాగరంటే.. నాజూకైన శరీరం మీ సొంతం
ఓ మెడికల్ జర్నల్ ప్రచురితమైన ఓ ఆర్టికల్ ప్రకారం యాపిల్ జ్యూస్ బొడ్డు ప్రాంతంలో ఉన్న కొవ్వును కరిగించడంలో ప్రభావవంతంగా పని చేసిందని తేలింది. యాపిల్ లో ఉన్న పాలిఫెనాల్స్ వల్ల ఎక్కువ రోజులు యాపిల్ తీసుకున్న వారిలో గణనీయమైన ఫలితాలు వెల్లడయ్యాయి.

మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం ఊబకాయం సమస్య అందరినీ వేధిస్తుంది. ముఖ్యంగా వేలాడే పొట్ట అందరినీ బాధిస్తుంది. ఊబకాయం, లేదా అధిక కొవ్వు సమస్య నుంచి బయటపడడానికి అంతా ఇప్పుడు వర్క్ అవుట్లు చేస్తున్నారు. అలాగే శారీరక వ్యాయామంతో పాటు కొన్ని ఆహార అలవాట్లల్లో మార్పులు చేసుకుంటున్నారు. ఉదయాన్నే వేడి నీరు తాగడం, రైస్ క్వాంటిటీ తగ్గించి తినడం, రాత్రి సమయంలో చపాతి తినడం వంటి చర్యలతో వేలాడే పొట్ట సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇందులో కొంత మందికి శరీరం అంతా బాగానే ఉన్న పొట్ట మాత్రం ఎదరికి రావడంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. నచ్చిన డ్రెస్ లు వేసుకోలేక, నలుగురిలోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి యాపిల్ మంచిగా పని చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. వారు చెప్పే మిగిలిన విషయాల గురించి ఓ సారి తెలుసుకుందాం
ఓ మెడికల్ జర్నల్ ప్రచురితమైన ఓ ఆర్టికల్ ప్రకారం యాపిల్ జ్యూస్ బొడ్డు ప్రాంతంలో ఉన్న కొవ్వును కరిగించడంలో ప్రభావవంతంగా పని చేసిందని తేలింది. యాపిల్ లో ఉన్న పాలిఫెనాల్స్ వల్ల ఎక్కువ రోజులు యాపిల్ తీసుకున్న వారిలో గణనీయమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఓ 124 మందిని రెండు గ్రూపులుగా విభజించి చేసిన పరిశోధనలో ఒకరికి పాలిఫెనాల్స్ అధికంగా ఉండే యాపిల్ జ్యూస్ లను అధికంగా ఇస్తే మరో గ్రూప్ పాలిఫెనాల్స్ లేని జ్యూస్ లను ఇచ్చారు. అయితే యాపిల్ జ్యూస్ తీసుకున్న వారిలో కొవ్వు శాతం అధికంగా తగ్గడంతో నిపుణులు కూడా యాపిల్ కొవ్వును తగ్గించడంలో సాయం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే యాపిల్ వల్ల కలిగే అదనపు ప్రయోజనాలపై కూడా ఓ లుక్కేద్దాం.
తక్కువ క్యాలరీలు
యాపిల్ అన్ని పండ్ల కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఓ పరిశోధన ప్రకారం 100 గ్రాముల యాపిల్ లో 50 క్యాలరీల మాత్రమే ఉంటాయి. కాబట్టి తక్కువ క్యాలరీలున్న యాపిల్ ను తినడం వల్ల దాన్ని అరిగించడానికి శరీరంలో ఉన్న క్యాలరీలు ఖర్చు అవుతాయి. కాబట్టి బరువు తగ్గే వారు కచ్చితంగా యాపిల్ ను వారి ఆహారంలో చేర్చుకోవాలి.
ఫెక్టిన్ ఫైబర్ పుష్కలం
యాపిల్ లో ఫెక్టిన్ ఫైబర్ అధికంగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం ఫెక్టిన్ ఫైబర్ జీవ క్రియకు సాయం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
అధిక నీటి కంటెంట్
ఓ మీడియం సైజ్ యాపిల్ లో 85 శాతం నీరు ఉంటుంది. దీని వల్ల యాపిల్ ను ఆరోగ్య కరమైన పండుగా వైద్యులు చెబుతారు. అలాగే అధికంగా నీరు ఉండడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి సాయం చేస్తుంది. తద్వారా శరీర బరువు నిర్వహణకు సూపర్ గా పని చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..