Apple Benefits: శీతాకాలంలో యాపిల్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఈ 4 సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు..

Apple Benefits in Winter Season: ప్రతి రోజూ ఓ యాపిల్ ను తింటే డాక్టర్ ను దూరం పెట్టవచ్చు అనే సామెత మనం ఎప్పటి నుంచో వింటున్నాం. అయితే ఆ సామెతకు తగ్గట్టే శీతాకాలంలో యాపిల్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Apple Benefits: శీతాకాలంలో యాపిల్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఈ 4 సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు..
Apple BenefitsImage Credit source: TV9 Telugu
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 10, 2022 | 12:02 PM

Apple Benefits in Winter Season: ప్రతి రోజూ ఓ యాపిల్ ను తింటే డాక్టర్ ను దూరం పెట్టవచ్చు అనే సామెత మనం ఎప్పటి నుంచో వింటున్నాం. అయితే ఆ సామెతకు తగ్గట్టే శీతాకాలంలో యాపిల్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. యాపిల్ ను ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. యాపిల్ తింటే ఎన్నో విటమిన్లు, మినరల్స్ తో పాటు అధిక ఫైబర్ ను శరీరానికి అందించవచ్చు. యాపిల్ ను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఫెక్టిన్ అనే ఫైబర్ వల్ల జీవ క్రియ మెరుగుపడుతుంది. అలాగే గుండె పని తీరును కూడా యాపిల్ తినడం వల్ల మెరుగు పర్చుకోవచ్చు.

ఓ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ యూనివర్సిటీ రిపోర్ట్స్ ప్రకారం ఓ మీడియం సైజ్ యాపిల్లో 4.8 గ్రాములు ఫైబర్, 0.5 గ్రాముల కొవ్వు, 0.6 గ్రాములు ప్రోటీన్, 100 మిల్లిగ్రాముల పోటీషియం. 11.6 గ్రాముల కార్భోహైడ్రేట్స్, అలాగే 6 మిల్లిగ్రాముల విటమిన్ సీ ఉంటుందని పేర్కొంది. దీన్ని బట్టే యాపిల్ ను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.

శీతాకాలంలో యాపిల్ ను తినడం వల్ల ప్రయోజనాలను తెలుసుకుందాం.

శీతాకాలంలో, మనలో సాధారణ రోగనిరోధక శక్తి తగ్గిపోయి శరీం వైరస్ లు బ్యాక్టీరియా బారిన పడి ఇన్ఫెక్షన్లు సంక్రమించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో యాపిల్స్ ను తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెంచి, ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడంలో సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

1.జీర్ణక్రియకు దోహదం..

సాధారణంగా చలికాలంలో ఆహారం జీర్ణం కాదు. కానీ యాపిల్ ను తింటే జీర్ణ క్రియ మెరుగుపడుతంది. వైద్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్ లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పేగుల నుంచి నీటిని గ్రహించి జీర్ణక్రియకు సాయం చేస్తుంది. అలాగే యాపిల్ తింటే మలబద్ధకం సమస్యలను నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే యాపిల్ లో ఉండే మాలిక్ యాసిడ్ కూడా జీర్ణక్రియ సక్రమంగా అవ్వడానికి ఉపయోగపడుతుంది.

2.బరువు తగ్గేందుకు..

యాపిల్  తినడం వల్ల అందులో ఉన్న అధిక ఫైబర్ మన శరీర బరువును క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుంతుంది. అలాగే రోజుకు రెండు నుంచి మూడు యాపిల్స్ ను తినడం వల్ల శరీరంలో ఎల్ డీ ఎల్ లెవెల్ ను తగ్గించడానిక హెచ్ డీ ఎల్ లెవెల్స్ ను పెంచడానికి దోహదం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు శారీరక వ్యాయమం చేయడంతో పాటు పోషకాహారంగా యాపిల్ ను మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

3.బ్లడ్ షుగర్ కంట్రోల్..

షుగర్ వ్యాధిగ్రస్తులు యాపిల్ ను తినడం వల్ల వారి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంటాయి. అలాగే యాపిల్ తొక్కలో ఉండే పాలిఫినాల్స్ క్లోమ గ్రంధి ఇన్సులిన్ సరఫరా చేసేందుకు సాయం చేస్తుంది.

4.హార్ట్ ఎటాక్ దూరం..

చలి వాతావరణం వల్ల శరీరంలోని రక్త నాళాలు సంకోచానికి గురి కావడంతో బీపీ పెరుగుతుంది. అలాగే గుండె వ్యాధిగ్రస్తులు యాపిల్ ను తినడం వల్ల అందులో ఉన్న అధిక ఫైబర్ శరీరంలో ఉండే కొలేస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి