Child Health: చలికాలం చిన్నారుల్లో జలుబు, దగ్గు వేధిస్తోందా.? బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ను ఇలా గుర్తించండి..
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల దాడి పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వారిలో ఇన్ఫెక్షన్ల ప్రభావం..
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల దాడి పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వారిలో ఇన్ఫెక్షన్ల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రోన్కైటిస్, న్యుమోనియా, ఆస్తమా వంటి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. చలికాలంలో బ్యాక్టీరియల్, వైరల్ అటాక్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్నారుల్లో శ్వాస సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం చిన్నారుల రెస్పిరేటరీ రేట్ (RR)ను గమనించాలి. RR అంటే చిన్నారులు ఒక నిమిషంలో ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకున్నాడో తెలిపేది. చిన్నారులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు శ్వాసకోశ రేటును లెక్కించాలని నిపుణులు చెబుతున్నారు. ఏడాది కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారుల్లో నిమాషానికి 50 కంటే ఎక్కువ ఆర్‌ఆర్ ఉంటే శ్వాస తీసుకుంటే సమస్య ఉందని గుర్తించాలి, ఇక 1 నుంచి 5 ఏళ్ల మధ్య వయస్సు ఉంటే నిమిషానికి 40 కంటే ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటే, అలాగే 5 ఏళ్లు పైబడిన వారు 30 కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
ఇక చిన్నారుల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకితే జ్వరం, చలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అలాగే తలనొప్పి, అలసట, ఆకలి లేకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఏవీ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. అవసరానికి అనుగుణంగా వైద్యులు ఎక్స్‌రే, లేదా కఫం పరీక్ష ఆధారంగా సమస్యను గుర్తించి చికిత్సను అందిస్తారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..