AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Growth Tips: కాఫీ, టీ తాగితే జుట్టు ఊడిపోతుందా? ఈ జ్యూస్‌లు సేవిస్తే వత్తైన జుట్టు మీ సొంతం

, కాఫీ మాత్రమే కాదు..తియ్యటి పానియాలు ఏమి తీసుకున్నా జుట్టు సమస్య వేధిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్న పరిశోధనల ప్రకారం కేవలం హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రమే జుట్టు సమస్యకు పరిష్కారంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. కొన్ని రకాల పానియాల్లో ఉండే తీపిదనం కారణంగా జుట్టు ఊడిపోయే ప్రమాదం 30 శాతం అధికంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు.

Hair Growth Tips: కాఫీ, టీ తాగితే జుట్టు ఊడిపోతుందా? ఈ జ్యూస్‌లు సేవిస్తే వత్తైన జుట్టు మీ సొంతం
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 18, 2023 | 9:00 AM

Share

అందం విషయంలో జుట్టు ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలుసు. చూడడానికి ఎంత బాగున్నా..అతనికి బట్టతల ఉంటే ఏదో చిన్న అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం బిజీ లైఫ్, ఆహారం నియమాల విషయంలో తీసుకునే పొరపాట్లు జుట్టు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న కాలుష్యం వల్ల హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుంది. అయితే ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణం టీ, కాఫీ వంటి పానియాలు కొంతమంది చెబుతుంటారు. అయితే టీ, కాఫీ మాత్రమే కాదు..తియ్యటి పానియాలు ఏమి తీసుకున్నా జుట్టు సమస్య వేధిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్న పరిశోధనల ప్రకారం కేవలం హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రమే జుట్టు సమస్యకు పరిష్కారంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. కొన్ని రకాల పానియాల్లో ఉండే తీపిదనం కారణంగా జుట్టు ఊడిపోయే ప్రమాదం 30 శాతం అధికంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. అయితే ఆడవారితో పోలిస్తే మగవాళ్లలో ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది. ఇలా ఎందుకు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఆడవారితో పోలిస్తే మగవాళ్లు బయట పానియాలు ఎక్కువగా సేవిస్తారని, అందువల్లే వారికి జుట్టు ఎక్కువగా ఊడిపోయి బట్టతలకు కూడా కారణమవుతుందని పేర్కొంటున్నారు. అలాగే ఆహార పానియాలు ఎక్కువ తాగిన స్త్రీలల్లో కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

జుట్టు పెరుగుదలకు ఈ పానియాల ట్రై చేస్తే సరి

బచ్చలికూర రసం

బచ్చలికూరలో ఐరన్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు కుదుళ్లతో సహా కణజాలకు ఆక్సిజన్ ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అలాగే బచ్చలికూరలో ఉన్న ఫెర్రిటిన్ అనే పోషకం జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. 

దోసకాయ రసం

దోసకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అలాగే ఆక్సికరణను పెంచుతుంది. ఇందులో ఉండే పోషకాలు సెబమ్‌ను ఉత్పత్తి చేయడానికి తలపై చర్మ గ్రంధులకు మద్దతు ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

ఉసిరి రసం

ఉసిరి జుట్టు పోషణకు సూపర్ గా పని చేస్తుంది. ఇది విటమిన్ సితో  ఉండడం వల్ల సెల్ డ్యామేజ్‌ని నిరోధిస్తుంది. దీంతో ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. 

క్యారెట్ జ్యూస్

క్యారెట్ లో విటమిన్లు ఏ, ఈ బీ లతో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే ప్రతి పోషకం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే జుట్టు పలచబడడాన్ని నివారిస్తుంది. 

కలబంద రసం

మన పెరట్లో ఉండే కలబంద మన జుట్టు, చర్మానికి చాలా మంచి చేస్తుంది. ఇందులో విటమిన్లు ఏ, సీ, ఈ ఉన్నాయి. ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడే పోషకాలు మనకు బలమైన మెరిసే జుట్టును పొందడంలో సహాయపడతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..