Stop Hair Fall Naturally: వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరగడానికి, బట్టలతపై జుట్టు మొలవడానికి ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే

Stop Hair Fall Naturally: వాతావరణ కాలుష్యం, తినే ఆహారం ఇవన్నీ నేటి జనరేషన్ ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపుతుంది. .ఒత్తిళ్ళతో కూడిన ఆధునిక జీవితం మనిషి..

Stop Hair Fall Naturally: వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరగడానికి, బట్టలతపై జుట్టు మొలవడానికి ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే
Hair Growth
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 18, 2021 | 3:50 PM

Stop Hair Fall Naturally: వాతావరణ కాలుష్యం, తినే ఆహారం ఇవన్నీ నేటి జనరేషన్ ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపుతుంది. .ఒత్తిళ్ళతో కూడిన ఆధునిక జీవితం మనిషి జుట్టు ఓడిపోవడానికి కారణమవుతుంది. వయసు తో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అనాదిగా వస్తున్నా ఆయుర్వేదంలో దీనికి నివారణకు చికిత్స ఉంది. ఇంట్లో దొరికే వస్తువులతో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ.. గహ వైద్యం చేసుకుంటే తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాలు పొందవచ్చు.. ఈరోజు జుట్టు ఊడిపోవడానికి బట్టతల సమస్యకు చెక్ పెట్టె చిన్న చిన్న చిట్కాల గురించి తెలుసుకుందాం..

జుట్టు పెరగడానికి:

*మందార పువ్వులు, గోరింటాకు, కలమంద గుజ్జును తీసుకుని ల్ల నువ్వుల నూనెలో వేసి బాగా మరగకాచుకోవాలి. అనంతరం ఈ నూనెను వడకట్టి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి. ఈ నూనె ను తలకు రాసుకోవాలి. ఈ నూనె ఒక నెలరోజులు రాస్తే.. నల్లగా నిగనిగలాడుతూ.. వెంట్రుకలు పెరుగుతాయి. తలనొప్పి కూడా తగ్గుతుంది. *కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టు నల్ల నువ్వుల నూనెలో కాచి .. తలకు పెట్టుకుంటే.. వెంట్రుకలు పెరుగుతాయి. *గుంటగలగర ఆకురసం నువ్వుల నూనెను కలిపి వేడి చేసి.. దానిని తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి.

వెంట్రుకలు ఊడిపోకుండా:

*ఉసిరి రసం, గుంట గలగర రసం కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి తలకు రాయడం వల్ల జుట్టు రాలదు. *కొబ్బరి నూనెలో కలమంద గుజ్జు కలిపి వేడి చేసి తలకు రాయాలి. ఈ మిశ్రమం వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తుంది. *బాదం నూనె, కరక్కాయ నూనె కలిపి రాసినా మంచి ఫలితం ఉంది.

బట్టతల తగ్గడానికి:

*వయసు తో సంబంధం లేకుండా ప్రస్తుతం ఎక్కువమంది బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటివారు సీతాఫలం ఆకును పేస్ట్ చేసి.. మేక పాలలో కలిపి తలకు రాస్తుండాలి. ఇలా తరచుగా చేస్తుంటే చాలా వరకూ బట్టతల తగ్గే అవకాశం ఉంది. *గురివింద ఆకురసం నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి తలకు రాసుకున్నా బట్టతల తగ్గే అవకాశం ఉంది.

జుట్టురాలడానికి ప్రధాన కారణం నీళ్లతో క్లోరిన్‌ శాతం ఎక్కువగా ఉండటంతో పాటు విటమిన్‌ ‘ఏ’ లోపం కూడా కారణం కావచ్చు. కనుక అటువంటి వారు రాత్రి తలకు అరచెక్క నిమ్మరసం పట్టించి మర్నాడు తలస్నానం చేయాలి. దీనిలోని సిట్రిక్‌ ఆమ్లం శిరోజాలు పెరిగేందుకు సహాయం చేస్తుంది.

Also Read: ముంబైలో భారీ వర్షాలు.. 22 మంది మృతి.. మరో 24గంటలు భారీ వర్షం కురిసే అవకాశం..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ