Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు.. 22 మంది మృతి.. మరో 24గంటలు భారీ వర్షం కురిసే అవకాశం..

Mumbai Rains: దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో వర్షాలు..

Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు.. 22 మంది మృతి..  మరో 24గంటలు భారీ వర్షం కురిసే అవకాశం..
Mumbai Rains
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 18, 2021 | 3:07 PM

Mumbai Rains: దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ముంబైలో వర్షాలు వరదల వలన వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మరణించారు. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్స్ ఫై నీరు నిలిచిపోవడంతో పలు లోకల్ ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎవరార్డ్ నగర్, హనుమాన్ నగర్, పనవేల్, వాసీ, మాన్ ఖూర్, జీటీపీ నగర్, గాంధీ మార్కెట్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీరు నిలిచిపోయింది. షణ్ముక్ నంద హాల్ రోడ్డు నీట మునిగింది.సియాన్ రైల్వే స్టేషన్ లో.. వరద నీరు ట్రాక్ మీదకు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీరు రహదారులపై నిలవడంతో.. హైవేలపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. బోరివాలి ఈస్ట్ ఏరియా ప్రాంతంలో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి.

ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. ముంబైలోని మహుల్ ప్రాంతంలో ఆదివారం భారీ వర్షాల కురిశాయి. దీంతో ఆ ప్రాంతంలో గోడకులైపోయింది. ఇద్దరు మహిళలు విద్యుదాఘాతానికి భయపడి 2 గంటలు పాటు చెక్క నిచ్చెనపై నిలబడ్డారు. మరోవైపు తెల్లవారుజామున 1 గంటల సమయంలో మహుల్‌లోని భరత్‌నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి కొండపై ఉన్న కొన్ని ఇళ్లపై కాంపౌండ్ గోడ కూలి 15 మంది మరణించారు.

మరోవైపు మహారాష్ట్రలోని పలు జిల్లాలలో పాటు ముంబై, ఠానేల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముంబై సముద్ర తీరంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే ఉందని హెచ్చరిస్తుంది.అందువల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే అన్ని ఏజెన్సీలు అధిక అప్రమత్తంగా ఉండాలని .. తక్షణ చర్యలు చేపట్టే విధంగా రెస్క్యూ టీమ్ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ముంబైలో నీటి సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. నీటి సరఫరా పునరుద్ధరించబడిన తర్వాత, త్రాగునీటిని వేడి చేసి తాగాలని అధికారులు ముంబై వాసులకు చెప్పారు.

Also Read: మరోసారి ప్రేక్షకులను డ్యూయెల్ రోల్‌లో అలరించడానికి రెడీ అవుతున్న ఎనర్జిటిక్ హీరో