పార్లమెంట్ సమావేశాల ముందే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ.. ఆ కొత్త మంత్రి విదేశీయుడా ?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ మొదలైంది. హోమ్ శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ పౌరసత్వంపై వివాదం తలెత్తింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ మొదలైంది. హోమ్ శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ పౌరసత్వంపై వివాదం తలెత్తింది. ఆయన జాతీయత, జన్మస్థలంపై ఎంక్వయిరీ జరిపించాలంటూ అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా ప్రధాని మోదీకి లేఖ రాశారు. 35 ఏళ్ళ ప్రమాణిక్ ఇటీవల కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు. ఆయన జాతీయతపై మీడియాలో వచ్చిన వార్తలను బోరా ప్రస్తావిస్తూ ఒక విదేశీయుడు కేంద్ర మంత్రి కావడమేమిటని ప్రశ్నించారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగారు. బోరా సరైన ప్రశ్న వేశారని బెంగాల్ మంత్రి బ్రాత్వా బసు ట్వీట్ చేయగా..ఇంద్రసేన్ అనే మరో మంత్రి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆయన బహుశా బంగ్లాదేశీయుడై ఉండవచ్చునన్నారు. అయితే బీజేపీ ఈ ఆరోపణలను కొట్టి పారేసింది.ప్రమాణిక్ విదేశీయుడనడానికి మీవద్ద ఆధారాలు ఉన్నాయా అని బెంగాల్ బీజేపీ శాఖ అధికార [ప్రతినిధి శామిక్ భట్టాచార్య ప్రశ్నించారు. మొదట రుజువులు చూపండి అని కోరారు.
అయితే బంగ్లాదేశ్ లోని గరిబంద జిల్లాలో హరినాథ్ పూర్ అనే వ్యక్తి కొడుకైన ప్రమాణిక్ సక్సెస్ ఫుల్ గా మంత్రి అయ్యాడని, బెంగాల్ లో కంప్యూటర్ సైన్స్ చదివాడని ఫేస్ బుక్ లో వచ్చిన ఓ పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది. బంగ్లా లోని పూజార్ మేలా అనే మతపరమైన సంస్థ ఈ పోస్ట్ పెట్టి ఆ తరువాత దీన్ని డిలీట్ చేసింది. కాగా తాను బెంగాల్ లోని కూచ్ బీహార్ జిల్లాకు చెందినవాడినని ప్రమాణిక్ లోక్ సభకు సమర్పించిన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఏమైనా..ఈయనపై మర్డర్ తో సహా డజను క్రిమినల్ కేసులు ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Etela Rajender: ఈటెల రాజేందర్ సరికొత్త వ్యూహం!.. తెరపైకి బీజేపీ అభ్యర్థిగా జమునా రెడ్డి.. అసలు కారణమదేనా?..
Oppo A16: ఒప్పో నుంచి మరో కొత్త బడ్జెట్ ఫోన్ .. ధర రూ.10 వేలలోనే.. ఫీచర్స్ వివరాలు..!