Etela Rajender: ఈటెల రాజేందర్ సరికొత్త వ్యూహం!.. తెరపైకి బీజేపీ అభ్యర్థిగా జమునా రెడ్డి.. అసలు కారణమదేనా?..

Etela Rajender: కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్‌ని బర్తరఫ్ చేయడం.. ఆయన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి..

Etela Rajender: ఈటెల రాజేందర్ సరికొత్త వ్యూహం!.. తెరపైకి బీజేపీ అభ్యర్థిగా జమునా రెడ్డి.. అసలు కారణమదేనా?..
Etela Rajender Politics
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 18, 2021 | 5:06 PM

Etela Rajender: కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్‌ని బర్తరఫ్ చేయడం.. ఆయన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం అన్నీ తెలిసిందే. అయితే, ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్‌ను బయటకొచ్చిన ఈటెల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. అయితే, తాజాగా హుజురాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. బీజేపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకూ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అనుకున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ.. ఇవాళ ఈటెల రాజేందర్ సతీమణి జమునారెడ్ఢి చేసిన కామేంట్స్.. ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఇద్దరిలో ఎవరో ఒక్కరు పోటి చేస్తామని అమె ప్రకటించడం అక్కడ ఆసక్తికరంగా మారింది.

వివరాల్లోకెళితే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. రూట్ మార్చారు.. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత… దూకుడు పెంచారు. విమర్శలు కూడా పెంచారు. ఎలాగైనా గెలవాలని, కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్న ఈటెల రాజేందర్ తో పాటు ఆయన భార్య జమున కూడా నియోజకవర్గంలో మకాం వేశారు. నియోజవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. సెంటీమెంట్ ను రగిల్చారు. దాదాపు అన్ని మండలాల్లో.. పర్యటన నిర్వహించారు జమునారెడ్ఢి. రాజేందర్ పోటి కన్ఫామ్ అయిపోయింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన బీజీపీలోకి వెళ్లడంలో జమున కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి ప్రతి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు జమునారెడ్ఢి. కానీ.. ఇప్పటి ఎన్నికలు ఈటెల కుటుంబానికి ఎంతో ముఖ్యం. దీంతో.. జమునారెడ్ఢి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.

అయితే, శనివారం నాడు హుజూరాబాద్ కేంద్రంలో జమునా రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారానికి వచ్చిన ఈటెల జమునను ఓ ఓటరు నిలదీశారు. ఈటెల ఫోటోతో ఉన్న గడియారాన్ని అందించగా.. జమునారెడ్డి ఎదుటే దానిని నేలకేసి కొట్టారు. 50, 100 రూపాయల గడియారాలు పంచి ఓటర్లను మభ్యపెడతారా? అంటూ సదరు ఓటు నిప్పులు చెరిగాడు. కాగా, ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే అంటే ఇవాళ జమునా రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా పోటీలో ఉండనున్నట్లు ప్రకటించారు. ఈటెల రాజేందర్ గానీ, తాను గానీ ఎవరో ఒకరు పోటీలో ఉంటారని, బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తామని జమునారెడ్డి ప్రకటించారు. అయితే, ఈటెల రాజేందర్ వ్యూహంలో భాగంగానే జమునా రెడ్డి ఈ కామెంట్స్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ఓట్లను బేరీజు వేసుకుని జమునారెడ్డితో ఈ రకమైన ప్రకటన చేయించారని అంచనా వేస్తున్నారు.

నిజానికి ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,29,124 ఓట్లు ఉన్నాయి. వీటిలో పురుషుల ఓట్లు 1,14,313 కాగా, స్త్రీల ఓట్లు 1,14,811. ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వీటిలోనూ రెడ్డిసామాజిక వర్గం ఓట్లు 22 వేలకు పైగా ఉండగా.. ముదిరాజ్‌ల ఓట్లు సుమారు 22 వేల వరకు ఉన్నాయి. ఈటెలకు బదులుగా జమునారెడ్డి పోటీ చేస్తే రెడ్డి ఓట్లతో పాటు.. ముదిరాజ్‌ ఓట్లు కూడా తమకే వస్తాయని ఈటెల రాజేందర్ వర్గం భావిస్తోంది. అంతేకాకుండా.. మహిళా ఓట్లు కూడా వస్తాయనే ఆలోచనలో ఈటెల ఉన్నారట. ఈ ప్లాన్ ప్రకారమే జమునారెడ్ఢి .. ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే.. ఈటెల రాజేందర్ ను టిఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. జమునారెడ్ఢి పోటీ చేస్తే… టిఆర్ఎస్ కూడా దూకుడు తగ్గించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఈటెల రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. సోమవారం నుంచి.. ఈటెల రాజేందర్ నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు ముందే.. జమునారెడ్ఢి ఈ కామేంట్స్ చేయడం.. రాజకీయ వ్యూహంలో భాగమే అని స్పష్టమవుతోంది.

Also read:

Kodali Nani: చంద్రబాబు, టీడీపీ నేతలపై మరోసారి తీవ్రంగా స్పందించిన మంత్రి కొడాలి నాని.. ఆయనెప్పుడైనా అలా చేశారా? అంటూ..

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ జలవివాదం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ జీవీఎల్..

Etela Rajender: ఈటెల రాజేందర్‌కు మరో కీలక నేత మద్ధతు.. అయితే బీజేపీకి మాత్రం కాదంటూ..