Kodali Nani: చంద్రబాబు, టీడీపీ నేతలపై మరోసారి తీవ్రంగా స్పందించిన మంత్రి కొడాలి నాని.. ఆయనెప్పుడైనా అలా చేశారా? అంటూ..

Kodali Nani: ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై..

Kodali Nani: చంద్రబాబు, టీడీపీ నేతలపై మరోసారి తీవ్రంగా స్పందించిన మంత్రి కొడాలి నాని.. ఆయనెప్పుడైనా అలా చేశారా? అంటూ..
Kodali Nani
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 18, 2021 | 4:14 PM

Kodali Nani: ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రైతులపై కపట ప్రేమ చూపుతూ డ్రామాలాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆదివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలో ఏడాదికి 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని వివరించిన ఆయన.. జగన్ ప్రభుత్వం మాత్రం 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏడాదికి రూ. 8,500 కోట్ల రూపాయలు చెల్లిస్తే.. తమ ప్రభుత్వం రూ. 16వేల కోట్లు చెల్లించామన్నారు. 21 రోజుల్లో రైతులకు డబ్బు చెల్లించాలని సీఎం జగన్ సొంతగా నిబంధన పెట్టుకున్నారని మంత్రి కొడాలి పేర్కొన్నారు. గతంలో అయితే మూడు నెలలకు కూడా డబ్బులు చెల్లించని పరిస్థితి ఉందని ఉదహరించారు.

ఇదే సమయంలో బీజేపీ నేతల తీరుపైనా మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. కొంత మంది బీజేపీ నేతలు కూడా ఇదేరకమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం.. ఏపీ సివిల్ సప్లైస్‌కు రూ. 5,056 కోట్లు బకాయిలు చెల్లించాలన్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి రూ. 1,600 కోట్లు చెల్లిస్తామన్నారని మంత్రి పేర్కొన్నారు. నాబార్డ్ కూడా రూ. 1,600 కోట్లు ఇస్తుందన్నారు. ఈ డబ్బులను కూడా రైతులకు చెల్లిస్తామని మంత్రి కొడాలి నాని వివరించారు. 21 రోజులు దాటి ఏపీ సర్కార్ చెల్లించాల్సిన బకాయిలు కేవలం రూ. 1,200 కోట్లు మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చంద్రబాబు మాటలను నమ్మొద్దని మంత్రి నాని విజ్ఞప్తి చేశారు.

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏనాడైనా 21 రోజుల్లోపు రైతులకు డబ్బులు చెల్లించారా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. రైతాంగాన్ని ఆందోళనకు గురి చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. 137 కార్పోరేషన్స్ ఒకే సారి ప్రకటించిన వ్యక్తి వైఎస్ జగన్ అని, 14 ఏళ్ళు సీఎం గా ఉండి ఎప్పుడైనా చంద్రబాబు ఇలా చేశారా? ప్రశ్నించారు. చంద్రబాబు చెబుతున్న సామాజిక న్యాయం అంటే సొంత కులానికి న్యాయం చేసుకోవడమే అని విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోడి పొడిచిన చంద్రబాబు.. ఆయన ఆశయాలను సైతం గాలికి వదిలేశారంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ ఉన్నారని కొడాలి పేర్కొన్నారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాల సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తన క్యాబినెట్‌లో 56 శాతం అట్టడుగు వర్గాలకు స్థానం కల్పించారిన కొనియాడారు.

Also read:

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ జలవివాదం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ జీవీఎల్..

NTR-Koratala: వరస సినిమాలతో ఎన్టీఆర్ బిజిబిజీ.. కొరటాలతో పాన్ ఇండియా మూవీ.. భారీ బడ్జెట్

IND vs SL 1st ODI Live: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 10 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!