AP Corona: ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..!

AP Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక దేశంలోని రాష్ట్రాలో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నాయి. ఒక వైపు వ్యాక్సినేషన్‌, మరో వైపు..

AP Corona: ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 18, 2021 | 5:38 PM

AP Corona: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక దేశంలోని రాష్ట్రాలో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నాయి. ఒక వైపు వ్యాక్సినేషన్‌, మరో వైపు లాక్‌డౌన్‌ ఆంక్షలు తదితర కఠినమైన చర్యల వల్ల ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి అదుపులో వచ్చింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,05,024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,974 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక తాజాగా కోవిడ్‌తో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మొత్తం 17 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,132 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1940096 ఉండగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 24,708గా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో 3,290 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1902256 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,35,93,055 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

తాజాగా జిల్లాల వారిగా నమోదైన కేసులు

అనంతపురం జిల్లాలో-98, చిత్తూరు -501, ఈస్ట్‌గోదావరి -577, గుంటూరు -179, కడప-106, కృష్ణా -311, కర్నూలు -65, నెల్లూరు -282, ప్రకాశం -349, శ్రీకాకుళం -73, విశాఖ – 120, విజయనగరం – 33, వెస్ట్‌గోదావరి -280 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కాగా, గతంలో ఏపీ రాష్ట్రంలో 20వేలకుపైగా నమోదయ్యే కేసులు.. ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పట్టాయి. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అనేకమైన చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించినా.. ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో కొంత కఠిన ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. కరోనాను మిరంతగా కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. గతంలో మాస్కులు ధరించనివారికి జరిమానా కూడా విధించారు. కరోనా కట్టడికి పోలీసులు కూడా తీవ్రమైన చర్యలు చేపట్టారు. ఇలాంటి చర్యలతో ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.

Ap

ఇవీ కూడా చదవండి

India Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో 518 మంది మృత్యువాత..

Covid-19 Vaccination: భారత్ మరో మైలురాయి.. 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సినేషన్‌..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట