India Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో 518 మంది మృత్యువాత..

Corona cases in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. శుక్రవారంతో పోల్చుకుంటే..

India Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో 518 మంది మృత్యువాత..
India Corona Updates
Follow us

|

Updated on: Jul 18, 2021 | 10:10 AM

Corona cases in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. శుక్రవారంతో పోల్చుకుంటే.. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24గంటల వ్యవధిలో (శనివారం) కొత్తగా 41,157 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు రెండువేల కేసులు పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 518 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,06, 065 కి చేరగా.. మరణాల సంఖ్య 4,13,609 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

నిన్న కరోనా నుంచి 42,004 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,02,69,796 చేరింది. ప్రస్తుతం దేశంలో 4,22,660 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 40కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ డోసులను అందించారు. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఆదివారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 40,49,31,715 డోసులను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:

Covid-19 Vaccination: భారత్ మరో మైలురాయి.. 40 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సినేషన్‌..

Tokyo Olympics 2021: ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం.. మరో ఇద్దరికి పాజిటివ్..