దేశంలో కొన్ని కోర్టుల విచారణలను లైవ్ గా చూడవచ్చు..సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్ .వి. రమణ.

Umakanth Rao

Umakanth Rao | Edited By: Anil kumar poka

Updated on: Jul 18, 2021 | 10:17 AM

దేశంలో కొన్ని కోర్టుల ప్రొసీడింగులను లైవ్ గా చూడవచ్చునని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని ఆయన చెప్పారు...

దేశంలో కొన్ని కోర్టుల విచారణలను లైవ్ గా చూడవచ్చు..సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్ .వి. రమణ.
Cji Justice N.v. Ramana

దేశంలో కొన్ని కోర్టుల ప్రొసీడింగులను లైవ్ గా చూడవచ్చునని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని ఆయన చెప్పారు. గుజరాత్ హైకోర్టు ప్రొసీడింగ్స్ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమాన్ని ఆయన వర్చ్యువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యున్నత న్యాయస్థానం ఈ దిశగా యోచిస్తోందని, ఈ కోర్టులో కూడా ఈ ప్రయోగం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుతం కోర్టు విచారణల గురించి ప్రజలు మీడియా ద్వారా తెలుసుకుంటున్నారని, అయితే ట్రాన్స్ మిషన్ ఏజెంట్లు ఆ సమాచారాన్ని విశ్లేషించి (ఫిల్టర్ చేసి) ఇస్తున్నారని.. ఇలాంటి సందర్భాల్లో సరైన కాంటెక్స్ట్ లేనికారణంగా ప్రశ్నలు, వాటికీ రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చే సమాధానాలు..లేదా వాటి స్పందన మిస్ ఇన్ఫర్మేషన్ తో (తప్పుడు) కూడుకుని ఉంటోందని ఆయన చెప్పారు. అంటే ఈ ట్రాన్స్ మిషన్ ఏజెంట్ల ‘విశ్లేషణ’ ఒక్కోసారి ఇలా ఉంట్టుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ధోరణిని కొన్ని స్వార్థపర శక్తులు వ్యవస్థకు అప్రదిష్ట తెచ్చేందుకు వినియోగించుకునే ప్రమాదం ఉందని అయన చెప్పారు. ఈ కారణం వల్లే విచారణలు లైవ్ గా చూపితే ఇందుకు ఆస్కారం ఉండదని జస్టిస్ రమణ పేర్కొన్నారు.

ప్రజలకు మొత్తం ప్రొసీడింగ్స్ తో బాటు జడ్జీల అభిప్రాయాలు, వారిచ్చే తీర్పుల గురించి స్పష్టంగా తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. . మిస్చీఫ్ జరగడానికి ఛాన్స్ ఉండదని ఆయన అన్నారు. ఇదే సమయంలో న్యాయమూర్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని.. రాజ్యాంగం కింద తాము చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలన్నారు. సాధారణంగా అందరు న్యాయమూర్తులు దీనికి కట్టుబడే ఉంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే లాయర్లు కూడా పబ్లిసిటీ కోసం పాకులాడరాదన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.

 బామ్మకు మనవరాలి అరుదైన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!ఆనందంతో ఎం చేసిందో తెలుసా..!:Rare Gift to Grandma Video.

 Viral Video: ఒలింపిక్‌ కిట్‌తో సానియా డ్యాన్స్‌ అదుర్స్‌…వైరల్ అవుతున్న వీడియో..:Sania Mirza Dance Video.

పెంపుడు కుక్కలకు ఆమె తొలి పరిచయం.. బిత్తరపోయిన మొహాలు చూసుకున్న శునకాలు వీడియో..:Pet Dog Video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu