AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..! అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..

అఖిల్ నెక్ట్స్ మూవీ విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. కొత్త దర్శకుడితో నెక్ట్స్ మూవీని కన్ఫాన్మ్ చేశారు అక్కినేని ప్రిన్స్‌. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా టైమ్‌ పట్టేలా ఉంది. దీంతో అసలు అఖిల్‌ ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న డిస్కషన్ జరుగుతోంది.

Akhil Akkineni: బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..! అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
Akhil Akkineni
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2025 | 9:21 PM

Share

అక్కినేని కుర్ర హీరో, అచ్చం హాలీవుడ్‌ హీరోల ఉండే హ్యాండ్సమ్ హీరో.. అయినా కూడా అఖిల్‌కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్‌ హిట్‌ పడలేదు. చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్స్ గా నిలిచాయి. వాటిలో మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ పర్లేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద పరాజాయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్‌ కూడా దారుణంగా డిజాస్టర్‌ కావడం అఖిల్‌ అభిమానులను నిరాశకు గురి చేసింది. మొదటి సినిమా మొదలుకొని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకోలేదు. అఖిల్ తో చేసిన దర్శకులు కూడా ఆషామాషీ వ్యక్తులు కాదు. టాలీవుడ్ లో పేరున్న దర్శకులతో అఖిల్ సినిమాలు చేశాడు. కానీ హిట్ మాత్రం మనోడికి అందని ద్రాక్షలా మారింది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

చివరిగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో అఖిల్‌ తర్వాతి ప్రాజెక్ట్‌ ఏంటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈసారైనా అఖిల్‌ హిట్‌ కొడతాడా.? అన్న క్యూరియాసిటీ పెరిగింది. అందుకే కాస్త గ్యాప్‌ తీసుకున్నా పర్లేదు కానీ సాలిడ్‌ హిట్‌తో ఇండస్ట్రీని షేక్ చేయాలని అఖిల్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ సినిమా లైనప్ చేశాడని తెలుస్తుంది. లెనిన్ అనే సినిమాను పట్టాలెక్కించాడు.

ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే

రురల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. కానీ ఈ సినిమాకు హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి. మొదటగా శ్రీలీలను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆతర్వాత ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు మరో భామ నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే అఖిల్ తో సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీగా ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటికే దీని గురించి చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి : సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్