సీనియర్ హీరోయిన్ లయ కూతుర్ని చూశారా..! అందంలో తల్లిని మించిపోయిందిగా..
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో లయ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ గా కనిపిస్తూ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫ్యామిలీ డ్రామా చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యామిలీ అడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్ లయ. అప్పట్లో తనదైన నటనతో సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. భద్రం కొడుకో సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయమైం.. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో తెలుగు తెరకుపరిచయమైంది లయ. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు వారికి చేరువైంది. ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, కోదండ రాముడు, దేవుళ్లు, రామా చిలుకమ్మ, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, స్వరాభిషేకం, అదిరిందయ్యా చంద్రం తదితర హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కాగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న టైంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది లయ.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది లయ. దాదాపు పదేళ్లపాటు అగ్రకథానాయికగా అలరించిన ఆమె.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. దీంతో సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం క్రితం బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం చిత్రంలో కనిపించిన లయ.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో నటిచింది లయ. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం లయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇది కూడా చదవండి : సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ
తాజాగా ఆమె ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందులో లయ కూతురు శ్లోకా స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది లయ కూతురు. ఇక ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిన్నది బాలయ్య బాబు నటించిన అఖండ 2లోనూ నటించిందని టాక్ వినిపిస్తుంది. ఇదే క్రమంలో శ్లోకా ఫొటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




