Tokyo Olympics 2021: ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం.. మరో ఇద్దరికి పాజిటివ్..
Tokyo Olympics Covid-19 Cases: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు కరోనా కలకలం సృష్టిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో శనివారం మొట్టమొదటి కోవిడ్-19 కేసు నమోదైన
Tokyo Olympics Covid-19 Cases: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు కరోనా కలకలం సృష్టిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో శనివారం మొట్టమొదటి కోవిడ్-19 కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్‌గా నమోదైంది. టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో ఆదివారం మరో ఇద్దరికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు నిర్వాహకులు వెల్లడించారు. స్ర్కీనింగ్ పరీక్షల్లో తేలిందని.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో క్రీడాకారులకు ప్రతిరోజూ స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నట్లు టోక్యో క్రీడల నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా టకాయా వెల్లడించారు.
కాగా.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆందోళనలు మొదలయ్యాయి. వేలాది మంది అథ్లెట్లు పాల్గొంటున్న ఈ మహాక్రీడల్లో మహమ్మారి ఎలా విజృంభిస్తుందోనన్న భయం నెలకొంది. కాగా.. గేమ్స్ నిర్వహణ కోసం విదేశాల నుంచి వచ్చిన ఓ విజిటర్‌కు వైరస్ సంక్రమిచిందని టోక్యో సీఈవో తోషిరో ముటో తెలిపారు. కాగా.. గోప్యత దృష్ట్యా కరోనా సోకిన అథ్లెట్ పేర్లను.. వారు ఏ దేశానికి చెందిన వారనేది వెల్లడించడం లేదు.
టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడలను కరోనా మహమ్మారి కారణంగా ఏడాది ఆలస్యంగా నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ప్రేక్షకులు లేకుండా కఠినతరమైన నిర్బంధం, నిబంధనలు, సామాజిక దూరం పాటిస్తూ క్రీడలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
Also Read: