- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos Tokyo olympics 2021 indian athlets in tokyo after mirabai chanu shooting team in japan
టోక్యో చేరుకున్న భారత క్రీడాకారులు.. ఒలింపిక్ గేమ్స్ విలేజ్ ఫొటోలను పంచుకున్న అథ్లెట్లు.. 5 రోజుల్లో క్రీడలు షురూ!
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్ గేమ్స్ జులై 23 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న భారత క్రీడాకారులు టోక్యో చేరుకుంటున్నారు.
Updated on: Jul 20, 2021 | 11:54 AM

ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి భారత ఆటగాళ్లు టోక్యో చేరుకోవడం మొదలుపెట్టారు. యాచింగ్ జట్టు తరువాత భారతదేశపు ఏకైక వెయిట్ లిఫ్టర్ చానుతపాటు జాతీయ కోచ్ విజయ శర్మ, అసిస్టెంట్ కోచ్ సందీప్ కుమార్ సెయింట్ నుంచి టోక్యో చేరుకున్నారు.

మీరాబాయి చాను టోక్యోలోని స్పోర్ట్స్ విలేజ్ నుంచి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో ఆమె మాస్క్ ధరించి కనిపించింది. మరో ఫొటోలో ఆహారం తింటూ కనిపించింది. టోక్యో క్రీడలకు చానుతో పాటు ఆమె కోచ్ ప్రమోద్ శర్మ, ఫిజియోథెరపిస్ట్ ఆలాప్ జవదేకర్ కూడా వచ్చారు.

భారత షూటింగ్ బృందం కూడా శనివారం టోక్యో చేరుకుంది. కోవిడ్ పరీక్ష కోసం షూటింగ్ బృందంలోని అందరి నుంచి నమూనాలను తీసుకున్నారు. ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అందుకుముందు శుక్రవారం క్రొయోషియాలోని జాగ్రెస్ బేస్ నుంచ అమ్స్‌ర్డామ్ చేరుకుంది.

భారత్‌కు చెందిన తొలి ఆటగాళ్ల బృందం శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరింది. యూరప్‌లో శిక్షణ పొందిన తరువాత సెయిలింగ్ బృందం ఇప్పటికే టోక్యో చేరుకోగా, బాక్సర్లు, షూటర్లు వరుసగా ఇటలీ, క్రొయోషియా నుంచి జపాన్ చేరుకుంటారు.




