Tokyo Olympics 2021: వెయిట్ లిఫ్టింగ్‌లో 20 ఏళ్ల నిరీక్షణకు అడ్డుకట్టపడేనా? భారీ అంచనాలతో మీరాబాయి చాను బరిలోకి!

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. కానీ, చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం పెద్దగా లేవు. ఇక ఒలింపిక్స్‌లో అయితే చాలా కష్టం. తొలిసారి 1948 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొన్నారు. కానీ, పతకం సాధించలేకపోయారు.

Tokyo Olympics 2021: వెయిట్ లిఫ్టింగ్‌లో 20 ఏళ్ల నిరీక్షణకు అడ్డుకట్టపడేనా? భారీ అంచనాలతో మీరాబాయి చాను బరిలోకి!
Mirabai Chanu
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 11:50 AM

Mirabai Chanu: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. కానీ, చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం పెద్దగా లేవు. ఇక ఒలింపిక్స్‌లో అయితే చాలా కష్టం. తొలిసారి 1948 లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొన్నారు.. కానీ, పతకం సాధించలేకపోయారు. 2000వ సంవత్సరంలో మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరీ సిడ్నీ ఒలింపిక్స్‌లో పాల్గొని బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇదే భారత్‌ తరపున ఎకైక వెయిట్ లిప్టింగ్ మెడల్ కావడం గమనార్హం. అప్పటి నుంచి నేటి వరకు మరో పతకం భారత్‌కు దక్కలేదు. ప్రతీసారి మొండి చేతులతో అథ్లెట్లు వెనుదిరిగి వస్తున్నారు. అయితే, ప్రస్తుతం వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం కచ్చితంగా సాధించే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. కారణం, మీరాబాయి చాను ఫేవరేట్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలో దిగనుంది. భారత్ నుంచి మీరాబాయి చాను తప్ప మరో వెయిట్ లిప్టర్ అర్హత సాధించలేదు. దీంతో చానుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో 20 ఏళ్ల తరువాత భారత్‌కు మరో పతకం దక్కనుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

మహిళల 49 కేజీల కేటగిరీలో మీరాబాయి చాను పోటీపడనుంది. గోల్డ్ మెడల్ రేసులో చైనాకు చెందిన హౌ జిహోయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొనోంది. మాజీ వరల్డ్ నంబర్ వన్ మీరాబాయి చాను ఇటీవల అద్భుతంగా ఆడుతోంది. దీంతో కచ్చితంగా పతకం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడుతోంది. ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ఈ లిఫ్టర్.. క్లీన్ జర్క్‌లో 119 కేజీల బరును ఎత్తి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. స్కాచ్‌లో 86 కేజీల పోటీల్లోనూ పాల్గొంది. అలాగే 2018 కాన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించింది. మీరాబాయి చానుకు ఇవి రెండో ఒలింపిక్ గేమ్స్. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న చాను.. మూడు ప్రయత్నాల్లో కనీస బరువు ఎత్తలేక ఇంటిబాట పట్టింది. అనంతరం పలు టెక్నిక్‌‌లు నేర్చుకుని 2017లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుతం అమెరికా వెళ్లి 45 రోజుల ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంది. అటునుంచే టోక్యోకు నిన్న చేరుకుంది.

Also Read:

IND vs SL: ప్రేమదాస స్టేడియంలో టీమిండియా, శ్రీలంక టీంల రికార్డులు.. పైచేయి ఎవరిదంటే?

18 నిమిషాల బ్యాటింగ్.. 200 స్ట్రైక్‌రేట్‌తో పరుగుల సునామీ సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ సూపర్ స్టార్!

150 బంతులు… 224 పరుగులు.. 17 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించిన టీమిండియా మహిళ క్రికెటర్!