Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భారత బాక్సర్లు.. టోక్యో చేరిన 9మంది క్రీడాకారులు

టోక్యో ఒలింపిక్స్‌ జులై 23 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈమేరకు భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.

Tokyo Olympics 2021: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భారత బాక్సర్లు.. టోక్యో చేరిన 9మంది క్రీడాకారులు
Indian Boxing Team In Olympics
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 11:51 AM

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌ జులై 23 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈమేరకు భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇప్పిటికే కొంతమంది క్రీడాకారులు తొలివిడతగా అక్కడికి చేరుకోగా, మరికొంతమంది సమాయత్తమవుతున్నారు. ఆగస్టు 8 వరకు జరిగే ఈ క్రీడల్లో ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు ఈసారి భారత బాక్సర్లు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లున్నారు. దాదాపు 9 మంంది బాక్సర్ల టీం టోక్యోకు బయలుదేరి వెళ్లింది. ఇటలీలో శిక్షణ తీసుకున్న అథ్లెట్లు.. నేరుగా టోక్యోకు బయలుదేరారు. ఈమేరకు బాక్సింగ్ సమాఖ్య ట్వీట్ చేసింది. భారత బాక్సర్లందరూ సురక్షితంగా టోక్యో చేరుకున్నారని పేర్కొంది.

పురుషుల బాక్సింగ్‌లో హీరోలు అమిత్, వికాస్ భారత బాక్సర్లలో 5గురు పురుషులు, 4గురు మహిళలు ఉన్నారు. పురుషుల బాక్సింగ్‌లో 52 కిలోల విభాగంలో అమిత్ పంగల్ పతకం సాధించే లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే 69 కిలోల పోటీల్లో పతకం సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత ఒలింపిక్స్‌లో అందకుండా పోయిన పతకాన్ని ఈ సారి సాధించేందుకు తెగ ఆరాటపడుతున్నాడు.

మేరీకోమ్ పై భారీ అంచనాలు.. మహిళా బాక్సర్లలో మేరీకోమ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 6సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్.. పతకంలో ప్రమోషన్ కొట్టాలని చూస్తోంది. ఇవి తన చివరి ఒలింపిక్స గేమ్స్. చివరి ఒలింపిక్స్‌లో ఎలాగైన పతకం సాధించాలని పట్టుదలతో ఉంది. 51కిలోల విభాగంలో మేరీ తలపడనుంది. 75కేజీల విభాగంలో పూజా రాణిపై కూడా అంచనాలు ఉన్నాయి. భారత బాక్సింగ్ జట్టుకు ఒకరోజు ముందు షూటింగ్ జట్టు కూడా టోక్యోకు చేరుకుంది. అయితే ఈ రెండు జట్టు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్టుగా శిక్షణలో మునిగిపోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కేసులు బయటపడుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో దాదాపు 11,500 మంది అథ్లెట్లు, సుమారు 79,000 మంది నిర్వహాకలు, సహాయక సిబ్బంది, మీడియా సిబ్బంది ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఉండనున్నారు. ఈమేరకు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నిర్వాకులు భయపడుతున్నారు. ఈమేరకు క్రీడా గ్రామంలోని వారందరికీ ప్రతిరోజూ పరీక్షలు చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్లాన్ చేస్తోంది. అంటే దాదాపు ప్రతిరోజూ 80,000 మందికి కోవిడ్-19 పరీక్షలు చేయనున్నారు. పరీక్షల కోసం 230 మంది డాక్టర్లు, 310 మంది నర్సులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

Also Read:

Tokyo Olympics 2021: వెయిట్ లిఫ్టింగ్‌లో 20 ఏళ్ల నిరీక్షణకు అడ్డుకట్టపడేనా? భారీ అంచనాలతో మీరాబాయి చాను బరిలోకి!

IND vs SL: ప్రేమదాస స్టేడియంలో టీమిండియా, శ్రీలంక టీంల రికార్డులు.. పైచేయి ఎవరిదంటే?