Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ప్రేమదాస స్టేడియంలో టీమిండియా, శ్రీలంక టీంల రికార్డులు.. పైచేయి ఎవరిదంటే?

మరికొద్ది గంటల్లో టీమిండియా, శ్రీలంకల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్. ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డేలో ఇరుజట్లు తలపడనున్నాయి.

IND vs SL: ప్రేమదాస స్టేడియంలో టీమిండియా, శ్రీలంక టీంల రికార్డులు.. పైచేయి ఎవరిదంటే?
Ind Vs Sl
Follow us
Venkata Chari

|

Updated on: Jul 18, 2021 | 1:54 PM

IND vs SL: మరికొద్ది గంటల్లో టీమిండియా, శ్రీలంకల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్. ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డేలో ఇరుజట్లు తలపడనున్నాయి. యువ జట్టుకు శిఖర్ ధావన్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. భారత్-శ్రీలంక జట్లు మూడు వన్డేలతో పాటు మూడు టీ20 సిరీస్‌ కూడా ఇదే స్టేడియంలో తలపడనున్నారు. అయితే ఈ స్డేడియంలో టీమిండయాకు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. దీంతో ఈ సిరీస్‌లోనూ టీమిండియా ఆధిపత్యం చెలాయించనుందని అంచాన వేస్తున్నారు. ఈ రాకార్డులను ఓసారి పరిశీలిద్దాం..

ఆర్. ప్రేమదాస స్టేడియంలోని పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటోంది. ఈ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదవడమే అందుకు కారణం. 2017లో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. భారత్, శ్రీలంక జట్ల మధ్య నేడు జరిగే మ్యాచ్ 131వది. ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 71 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. లక్ష్య చేధనలో 50 సార్లు విజయం సాధించాయి. 10 మ్యాచుల్లో ఎటువంటి ఫలితం తేలలేదు. ఈ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 169 పరుగులు కుమార సంగక్కర పేరుతో నమోదైంది. 2013లో దక్షిణాఫ్రికాపై సంగక్కర ఈ స్కోర్ నమోదు చేశాడు. బౌలింగ్‌లో ఏంజెలో మాథ్యూస్ 2009లో టీమిండియాపై 20 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. ఈ స్డేడియంలో అత్యధిక జట్టు స్కోరు 375/5 గా ఉంది. ఈ స్కోర్ 2017లో టీమిండియానే శ్రీలంకపై సాధించింది. ఇక అత్యల్ప జట్టు స్కోరుగా 86 పరుగులుగా నమోదయ్యాయి. (2002లో నెదర్లాండ్స్ జట్లు శ్రీలంకపై చేసింది). 2017లో భారత్-శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచులో కోహ్లీసేన 288 పరుగులు ఛేదించి, అత్యధిక ఛేజింగ్‌గా రికార్డు నెలకొల్పాయి.

ఇప్పటి వరకు భారత్, శ్రీలంక జట్లు 150కి పైగా వన్డేల్లో తలపడ్డాయి. భారత్ ఇప్పటి వరకు 91 మ్యాచుల్లో విజయం సాధిస్తే, శ్రీలంక 56 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగియగా, 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. శ్రీలంకపై భారత జట్టు అత్యధిక స్కోరు 414/7గా నమోదైంది. 2009తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోరు సాధించింది. షార్జాలో 2000వ సంవత్సరంలో లంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కేవలం 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియాకు ఇప్పటివరకు ఈ స్కోరే అత్యల్పం. అలాగే భారత్‌పై శ్రీలంక 96 పరుగుల అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.

Also Read:

18 నిమిషాల బ్యాటింగ్.. 200 స్ట్రైక్‌రేట్‌తో పరుగుల సునామీ సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ సూపర్ స్టార్!

150 బంతులు… 224 పరుగులు.. 17 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించిన టీమిండియా మహిళ క్రికెటర్!