Tokyo Olympics 2021: ఆ ‘పని’ కి నో ఛాన్స్.. నిర్వాహకుల వింత ఆలోచనతో అథ్లెట్లు పరేషాన్!

మరో నాలుగు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈమేరకు నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత్ నుంచి ఇప్పటికే కొంతమంది అథ్లెట్లు టోక్యో చేరుకున్నారు. మరికొంతమంది సమాయత్తమవుతున్నారు.

Tokyo Olympics 2021: ఆ 'పని' కి నో ఛాన్స్.. నిర్వాహకుల వింత ఆలోచనతో అథ్లెట్లు పరేషాన్!
Tokyo Olympic Games 2021
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 11:50 AM

Tokyo Olympics 2021: మరో నాలుగు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈమేరకు నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత్ నుంచి ఇప్పటికే కొంతమంది అథ్లెట్లు టోక్యో చేరుకున్నారు. మరికొంతమంది సమాయత్తమవుతున్నారు. భారత్ నుంచి దాదాపు 119 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటనున్నారు. అయితే తాజాగా అథ్లెట్లు నిర్వాహకులు ఓ షాక్ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో శృంగారాన్ని కట్టడి చేసేందుకు ఒలింపిక్స్ నిర్వాహకులు పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కండోమ్స్ పంపిణీ నిలిపేసిన నిర్వాహకులు.. మరో షాక్ ఇచ్చారు. కరోనా కారణంగా క్రీడాకారులు ఒకరితో ఒకరు కలవకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వారు శృంగారంలో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యమున్న బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. క్రీడాగ్రామంలోని అథ్లెట్ల గదుల్లో వీటిని ఏర్పాటు చేశారు. అట్టలతో తయారు చేసిన బెండ్స్‌ను ఏర్పాటు చేసి అథ్లెట్లకు షాకిచ్చింది. ఒక్కో బెడ్ గరిష్టంగా 200 కిలోల బరువు ఆపేలా డిజైన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అథ్లెట్ల మధ్య భౌతిక దూరం ఉండాలనే ఇలాంటి బెడ్స్‌ను తయారు చేయించినట్లు పేర్కొన్నారు. అట్టలతో తయారు చేసిన ఈ మంచాలతో కామ కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత ఈ అట్టల్ని రీసైక్లింగ్‌ చేస్తామని వారు పేర్కొన్నారు. వీటితో కాగితపు పలు ఉత్పత్తులు చేస్తామని సూచించారు.

ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్ల తొలి విడతగా ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌కు చెందిన 88 సభ్యుల బృందంలో 54 మంది అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది, ఐఓఏ ప్రతినిధి వెళ్లారు. ఇక తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పీవీ సింధు, సాయి ప్రణీత్‌, సాత్విక్‌ సాయిరాజ్ కూడా శనివారం టోక్యో వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ ఒలింపిక్స్‌కు భారత్‌ మొత్తం 228 సభ్యులను పంపిస్తోంది. ఇందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారు. భారత రోయింగ్‌, షూటింగ్‌ జట్లు ఇప్పటికే టోక్యో చేరుకున్న సంగతి తెలిసిందే. ఇటలీ నుంచి బయల్దేరిన బాక్సింగ్‌ బృందం ఆదివారం చేరుకుంది. భారత్‌ నుంచి నలుగురు సెయిలర్లతో కూడిన బృందం టోక్యోలో అడుగుపెట్టింది. గురువారమే సెయిలర్లు టోక్యో చేరుకున్నారు. అథ్లెట్లకు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా, సెక్రటరీ రాజీవ్ మోహతా, సాయ్ డైరెక్టర్ సందీప్ ప్రధాన్ సెండాఫ్ ఇచ్చిన వారిలో ఉన్నారు.

Also Read:

MS Dhoni: ‘రండి.. రండి కెప్టెన్ సాబ్’ అంటూ ధోనీ టీజ్.. ‘వస్తున్నా భాయ్ ముందు నువ్ తప్పుకో’ అన్న రైనా..!

IND vs SL: “ఎలా ఆడాలో కోచ్ చెప్పలేదు.. తలకు బంతి తగలడంతో ఏకాగ్రత పట్టు తప్పింది”

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!