MS Dhoni: ‘రండి.. రండి కెప్టెన్ సాబ్’ అంటూ ధోనీ టీజ్.. ‘వస్తున్నా భాయ్ ముందు నువ్ తప్పుకో’ అన్న రైనా..!

టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీతో సురేశ్ రైనా ప్రత్యేక అనుబంధం ఉంటుందనడంలో సందేహం లేదు. ఎక్కువ కాలం ధోనీతో ట్రావెల్ చేసిన రైనా.. తాజాగా వారిమధ్య జరిగిన ఓ సరదా సంఘటనను షేర్ చేసుకున్నాడు.

MS Dhoni: 'రండి.. రండి కెప్టెన్ సాబ్' అంటూ ధోనీ టీజ్.. 'వస్తున్నా భాయ్ ముందు నువ్ తప్పుకో' అన్న రైనా..!
Dhoni Suresh Raina
Follow us
Venkata Chari

|

Updated on: Jul 19, 2021 | 6:59 AM

MS Dhoni: టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీతో సురేశ్ రైనా ప్రత్యేక అనుబంధం ఉంటుందనడంలో సందేహం లేదు. ఎక్కువ కాలం ధోనీతో ట్రావెల్ చేసిన రైనా.. తాజాగా వారిమధ్య జరిగిన ఓ సరదా సంఘటనను షేర్ చేసుకున్నాడు. గుజరాత్‌ లయన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఐర్లాండ్‌లో ధోనీతో కూల్ డ్రింక్స్ తెప్పించాను, అలాగే తన కిట్ బ్యాగులను మోయించానని వెల్లడించాడు. 2016లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసింది. ఆటైంలో ‘రైజింగ్‌ పుణె’కు ధోనీ, ‘గుజరాత్‌ లయన్స్‌’కు రైనా సారథ్యం వహించారు. అపుడు పుణెతో తలపడినప్పుడు ఇలాంటి సంఘటన జరిగిందన్నాడు. ‘ఆ టైంలో భావోద్వేగానికి లోనయ్యాను. రాజ్‌కోట్‌లో ఆడుతున్నప్పుడు అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. నాన్‌స్ట్రైకర్‌ గా మెక్‌కలమ్‌ ఉండగా, నేను బ్యాటింగ్‌ చేస్తున్నాను. ధోనీ కీపర్‌గా ఉన్నాడు. డుప్లెసిస్‌ ఫస్ట్‌స్లిప్‌లో కాచుకుని ఉన్నాడు. వీళ్లంగా చెన్నై సూపర్ కింగ్స్‌లో ఒకే జట్టువాళ్లం. దీంతో నేను భావోద్వేగానికి లోనయ్యాను. దాంతోపాటు నేను క్రీజులోకి వచ్చేప్పుడు ‘రండి.. రండి.. కెప్టెన్‌ సాబ్‌’ అంటూ ధోనీ టీజ్ చేశాడు. ‘వస్తున్నా భాయ్‌.. ముందు మీరు పక్కకు తప్పుకోండి’ అని బదులిచ్చాను’ అని సురేశ్ రైనా వెల్లడించాడు.

2018లో ఐర్లాండ్‌ వెళ్లినప్పుడు.. ‘‘ఆ మ్యాచులో ధోనీ కూల్ డ్రింక్స్ అందించాడు. గ్లోవ్స్‌, బ్యాట్ల కోసం తరచుగా పిలుస్తుండడంతో ధోనీ నా కిట్‌బ్యాగ్‌ మొత్తం తీసుకొచ్చాడు. ‘ఏది కావాలో తీసుకో. ఊరికే పిలవకు. ఈ ప్రాంతంలో చాలా చలిగా ఉందని’ అన్నాడు. ‘ఇవన్నీ వద్దు కానీ, నా హ్యాండ్‌ గ్రిప్‌ తీసుకొస్తే చాలు’ అని ధోనితో అన్నాను. ‘భలే వాడివి తగిలావు. ముందు మంచినీళ్లు తాగు. హ్యాండ్ గ్రిప్స్ తీసుకొస్తాను’ అని వెళ్లాడు.

సురేశ్ రైనా 2005 నుంచి 2018 వరకు టీమిండియా తరపున ఆడాడు. 18 టెస్టులు ఆడిన సురేశ్ రైనా 768 పరుగులు సాధించాడు. 226 వన్డేలు ఆడి 35.3 సగటుతో 5615 పరుగులు సాధించాడు. అలాగే 78 టీ20లు ఆడి 29.2 సగటుతో 1605 పరుగులు సాధించాడు. అలాగే ఐపీఎల్‌లో 200 మ్యాచులు ఆడిన సురేశ్ రైనా 33.1 సగటుతో 5491 పరుగులు సాధించాడు.

Also Read:

INDvsSL: ఎలా ఆడాలో కోచ్ చెప్పలేదు.. తలకు బంతి తగలడంతో ఎకాగ్రత పట్టు తప్పింది: టీమిండియా ఓపెనర్!

IND vs SL 1st ODI: తొలి వన్డే మనదే.. శ్రీలంకపై భారత్‌ ఘన విజయం.. దుమ్ము లేపిన యువ ఆటగాళ్లు.