India vs Srilanka: కెప్టెన్‌గా ఎంట్రీ.. రికార్డులు కొల్లగొట్టిన గబ్బర్.. లెజెండ్ల సరసన..!

టీమిండియా విజయంలో యువ బ్యాట్స్‌మెన్లు పృథ్వీ షా, ఇషాన్ కిషన్ తోపాటు కెప్టెన్ శిఖర్ ధావన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వీరు అద్భుతంగా ఆడడంతో శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించింది టీమిండియా.

India vs Srilanka: కెప్టెన్‌గా ఎంట్రీ.. రికార్డులు కొల్లగొట్టిన గబ్బర్.. లెజెండ్ల సరసన..!
Shikhar Dhawan
Follow us
Venkata Chari

|

Updated on: Jul 19, 2021 | 8:21 AM

IND vs SL: టీమిండియా విజయంలో యువ బ్యాట్స్‌మెన్లు పృథ్వీ షా, ఇషాన్ కిషన్ తోపాటు కెప్టెన్ శిఖర్ ధావన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వీరు అద్భుతంగా ఆడడంతో శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించింది టీమిండియా. ఆదివారం జరిగిన తొలి వన్డేలో లంకపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ధావన్ అజేయంగా 86 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ధావన్ టీమిండియా గ్రేట్ ఓపెనర్‌ల జాబితాలో చేరాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 10,000 పరుగులు పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 10,000 పరుగులు చేసిన భారత ఐదవ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ధావన్ ప్రస్తుతం 10051 పరుగులతో ఉన్నాడు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 15758 పరుగులు పూర్తిచేశాడు.

సెహ్వాగ్ తరువాత సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 15,335 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా మరో దిగ్గజం సునీల్ గవాస్కర్ మూడవ స్థానంలో నిలిచాడు. గవాస్కర్ ఓపెనర్‌గా 12,258 అంతర్జాతీయ పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగుల మార్కును చేరుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గాను సునీల్ గవాస్కర్ రికార్డు నెలకొల్పాడు. గవాస్కర్ తరువాత, రోహిత్ శర్మ ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 10,051 పరుగులు చేశాడు.

అలాగే ఆదివారం తొలిసారిగా కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ధావన్.. అత్యధిక వయసులో టీమిండియాకు కెప్టెన్‌గా (35 సంవత్సరాల 225 రోజులు) వ్యవహరించి రికార్డు సాధించాడు. ఈ సందర్భంగా 1984లో 34 సంవత్సరాల 37 రోజుల వయసులో తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యహరించిన ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును బద్దలు కొట్టాడు. ధావన్ వన్డేల్లో 6,000 పరుగులు పూర్తి చేసి మరో రికార్డును సాధించాడు. కేవలం 140 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును పూర్తి చేశాడు. అలాగే శ్రీలంకతో వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన లిస్టులో తొలిస్థానంలో నిలిచాడు. ఇందుకు కేవలం 17 ఇన్నింగ్స్‌లో పూర్తి చేశాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండ్ హషీమ్ అమ్లా (18 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేంది.

Also Read:

Tokyo Olympics 2021: ఆ ‘పని’ కి నో ఛాన్స్.. నిర్వాహకుల వింత ఆలోచనతో అథ్లెట్లు పరేషాన్!

MS Dhoni: ‘రండి.. రండి కెప్టెన్ సాబ్’ అంటూ ధోనీ టీజ్.. ‘వస్తున్నా భాయ్ ముందు నువ్ తప్పుకో’ అన్న రైనా..!

IND vs SL: “ఎలా ఆడాలో కోచ్ చెప్పలేదు.. తలకు బంతి తగలడంతో ఏకాగ్రత పట్టు తప్పింది”