- Telugu News Sports News Cricket news India vs srilanka 1st odi shikhar dhawan breaks few records here is the list
India Vs Srilanka: గబ్బర్ రికార్డుల మోత.. కెప్టెన్‌గా అరుదైన ఘనత.. సెహ్వాగ్‌తోనే పోటీ!
India Vs Srilanka: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ధావన్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్ మెరుపులతో టీమిండియా...
Updated on: Jul 19, 2021 | 9:30 AM

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, కృనాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్.. ధావన్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్ మెరుపులతో టీమిండియా 7 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే క్రికెట్‌లో అత్యంత పెద్ద వయస్కుడిగా కెప్టెన్ అయిన ఘనతను శిఖర్ ధావన్ సొంతం చేసుకున్నాడు. 35 సంవత్సరాల 225 రోజుల వయసులో ధావన్ కెప్టెన్సీకి దక్కించుకున్నాడు. ఈ తరుణంలో అతడు దిగ్గజ భారతీయ ఆల్ రౌండర్ మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును బద్దలు కొట్టాడు.

వన్డేల్లో ధావన్ 6000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అతడు 140 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ మార్క్ దాటిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో నిలిచాడు.

అలాగే శ్రీలంకపై 17 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ధావన్.. దక్షిణాఫ్రికా లెజెండ్ హషీమ్ ఆమ్లా (18 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

అటు అంతర్జాతీయ క్రికెట్‌లో ధావన్ 10,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్‌గా గబ్బర్ ఈ ఘనతను అందుకోగా.. 15,758 పరుగులతో వీరేంద్ర సెహ్వాగ్ ముందంజలో ఉన్నాడు.





























