IND vs SL: అరంగేట్ర మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు.. కృనాల్ పాండ్య తర్వాత..!
శ్రీలంకతో కొలంబో వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత యువ బ్యాట్స్‌మన్లు పృథ్వీ షా, ఇషాన్ కిషన్ రెచ్చిపోయారు. వీరికి తోడు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ శిఖర్ ధావన్ చెలరేగడంతో టీమిండియా తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IND vs SL: శ్రీలంకతో కొలంబో వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత యువ బ్యాట్స్‌మన్లు పృథ్వీ షా (43: 24 బంతుల్లో 9×4), ఇషాన్ కిషన్ (53; 34 బంతుల్లో 8×4, 2×6) రెచ్చిపోయారు. వీరికి తోడు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ శిఖర్ ధావన్ (86; 95 బంతుల్లో 6×4, 1×6) చెలరేగడంతో టీమిండియా తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఇక అరంగేట్రం మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఫోర్లు, సిక్సులు బాదుతూ అర్ధ శతకం చేశాడు. కేవలం 34 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేశాడు. దీంతో ఎంట్రీ మ్యాచులోనే వేగంగా హాఫ్ సెంచరీ బాదిన రెండవ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా 26 బంతుల్లోనే అర్థ శతకం బాది రికార్డు నెలకొల్పాడు. రోలాండ్ బుట్చేర్, జాన్ మోరిస్ 35 బంతుల్లో అర్థ శతకం చేసి తర్వాతి స్థానాల్లో నిలిచారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం.. 50 ఓవర్లకు 263 పరుగులు చేసింది. కరుణరత్న (43; 35 బంతులు, ఫోర్, రెండు సిక్సులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాదర్, చాహల్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ పృథ్వీ షా(43 పరుగులు; 24 బంతులు, 9 ఫోర్లు), శిఖర్ ధావన్ (86 నాటౌట్; 95 బంతులు, 6ఫోర్లు, 1సిక్స్) ఓపెనింగ్‌గా బరిలోకి దిగారు. ఓపెనర్ పృథ్వీ తొలి ఓవర్ నుంచే లంక బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఓవర్‌కు రెండు ఫోర్ల చొప్పున కొడుతూ దూకుడు పెంచాడు. క్రీజులో కొద్దిసేపే ఉన్నా.. బౌలర్లను ఊచకోత కోశాడు. ఇషాన్ కిషన్ (53; 34 బంతుల్లో 8×4, 2×6) శిఖర్‌కు తోడవడంతో భారత్ విజయం నల్లేరుపై నడకలా మారింది. మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతంగా (31; 20 బంతుల్లో 5×4) ఆడాడు. ఈ మ్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
My dream turning into reality and there is no better feeling. Wearing the India blue is such an honor. Thank you everyone for your wishes and support. The goal remains to continue the hard work, giving it my all for my country ???? pic.twitter.com/YzjWtSjnT2
— Ishan Kishan (@ishankishan51) July 18, 2021
5⃣0⃣ on T20I debut ✅ 5⃣0⃣ on ODI debut ✅@ishankishan51 knows a thing or two about making a cracking start ? ? #TeamIndia #SLvIND
Follow the match ? https://t.co/rf0sHqdzSK pic.twitter.com/i4YThXGRga
— BCCI (@BCCI) July 18, 2021
Also Read:
Tokyo Paralympics 2020: అథ్లెట్‌గా మారిన కలెక్టర్.. సరికొత్త రికార్డుతో పారా ఒలింపిక్స్‌కు పయనం!
India Vs Srilanka: గబ్బర్ రికార్డుల మోత.. కెప్టెన్‌గా అరుదైన ఘనత.. సెహ్వాగ్‌తోనే పోటీ!
India vs Srilanka: కెప్టెన్‌గా ఎంట్రీ.. రికార్డులు కొల్లగొట్టిన గబ్బర్.. లెజెండ్ల సరసన..!