IND vs SL 1st ODI: తొలి వన్డే మనదే.. శ్రీలంకపై భారత్ ఘన విజయం.. దుమ్ము లేపిన యువ ఆటగాళ్లు.
IND vs SL 1st ODI: కొలంబో ప్రేమదాసు వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడే వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో భారత్ విజయ కేతనం ఎగరేసింది....
IND vs SL 1st ODI: కొలంబో ప్రేమదాసు వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మూడే వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో భారత్ విజయ కేతనం ఎగరేసింది. ఏడు వికెట్ల తేడతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. శిఖర్ దావన్ 95 బంతుల్లో 86 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికిగాను 262 పరుగులు చేసింది. చివర్లో కరుణరత్నె(43 నాటౌట్) ధాటిగా ఆడడంతో శ్రీలంక జట్టు స్కోరు పెరిగింది.
ఇక శ్రీలంక నిర్ధేశించిన లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా చేధించింది. యువ ఓపెనర్ పృథ్వీ షా 24 బంతుల్లో 43 పరుగులు సాదించి రాణించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇక కెప్టెన్ శిఖర్ దావణ్ (85), సూర్యకుమార్ (31) చివరి వరకు క్రీజులో నిలిచి తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వన్డే అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఇలా యంగ్ ప్లేయర్స్ సమిష్టిగా రాణించడంతో భారత్ లక్ష్యాన్ని 36.4 ఓవర్లలోనే పూర్తి చేసింది.
A comprehensive 7-wicket win for #TeamIndia to take 1-0 lead in the series?
How good were these two in the chase! ??
8⃣6⃣* runs for captain @SDhawan25 ? 5⃣9⃣ runs for @ishankishan51 on ODI debut ?
Scorecard ? https://t.co/rf0sHqdzSK #SLvIND pic.twitter.com/BmAV4UiXjZ
— BCCI (@BCCI) July 18, 2021
పోలవరం అంచనాల ఆమోదంలో ఉద్దేశపూర్వక జాప్యం.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రంపై వైసీపీ మండిపాటు