AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ధీశాలి ధైర్యానికి హ్యాట్సాప్.. బిడ్డను ఎత్తుకెళ్లిన చిరుతపులి.. తరిమి తరిమి కొట్టి తల్లి..

Maharashtra: ఈ లోకంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదని ఎన్నోసార్లు నిరూపితం అయ్యింది. తల్లి తన పిల్లలను కాపాడుకునేందుకు..

Maharashtra: ధీశాలి ధైర్యానికి హ్యాట్సాప్.. బిడ్డను ఎత్తుకెళ్లిన చిరుతపులి.. తరిమి తరిమి కొట్టి తల్లి..
Leopard
Shiva Prajapati
|

Updated on: Jul 18, 2021 | 10:07 PM

Share

Maharashtra: ఈ లోకంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదని ఎన్నోసార్లు నిరూపితం అయ్యింది. తల్లి తన పిల్లలను కాపాడుకునేందుకు.. తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. ఎన్నోసందర్భాల్లో ఇది చూశాం. అయితే, మహారాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ తల్లి తన కూతురును రక్షించుకునేందుకు క్రూర మృగమైన చిరుత పులితో పోరాడింది. చిరుతను బెదిరించి.. ఐదేళ్ల పసిబిడ్డ ప్రాణాలను రక్షించుకుంది. ఈ ధీనవనితకు సంబంధించిన వార్త చాలా ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళితే.. చంద్రాపూర్ జిల్లా కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునోనా గ్రామానికి చెందిన అర్చన మెష్రామ్ తన ఐదేళ్ల కూతురుతో గ్రామ శివార్లకు వెళ్తోంది. ఆ సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత పులి.. తల్లి వెనుక నడుస్తున్న కూతురుపై దూకింది. చిరుతను చూసిన మహిళ తొలుత భయపడిపోయింది. కానీ తన బిడ్డ ప్రాణాపాయంలో ఉండటంతో ధైర్యం తెచ్చుకుంది. పక్కనే ఉన్న ఓ వెదురు కర్రను తీసుకుని ఆ చిరుత కొట్టింది. నోట కరుచుకున్న బాలికను వదలేవరకు ఆ తల్లి చిరుతను చితక్కొట్టింది. మహిళ దాడికి బెదిరిపోయిన చిరుత పులి.. ఆ చిన్నారిని వదిలిపెట్టి అడవిలోకి పారిపోయింది.

అయితే, చిరుత దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాధిత బాలికను చంద్రపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ చిన్నారికి సోమవారం నాడు నాగ్‌పూర్ ప్రభుత్వాస్పత్రిలో శస్త్ర చికిత్స చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును అటవీశాఖ తరఫున అందజేస్తున్నారు. కాగా, ఈ ఘటన జూన్ 30వ తేదీన చోటు చేసుకోగా.. తాజాగా అధికారులు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Also read:

Viral Video: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఎలుగుబంటి.. వారం రోజుల పాటు నరకయాతన చూసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘దళిత సాధికారత’ పథకంలో కీలక మార్పు..

Telangana: ఎవరితో శత్రుత్వం లేదు.. తెలంగాణకు నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం.. కేంద్రానికి స్పష్టం చేసిన టీఆర్ఎస్..

Follow Us
ఆ ఒక్క పొరపాటుతో మీ కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఖాయం!
ఆ ఒక్క పొరపాటుతో మీ కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఖాయం!
గ్యాస్ వినియోగదారులకు షాక్.. రాయితీ సిలిండర్ల సంఖ్య తగ్గింపు!
గ్యాస్ వినియోగదారులకు షాక్.. రాయితీ సిలిండర్ల సంఖ్య తగ్గింపు!
ధనవంతులు కూడా హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ధనవంతులు కూడా హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
చరిత్రలో మొదటిసారి..పగలు రాత్రి కాబోతోంది..
చరిత్రలో మొదటిసారి..పగలు రాత్రి కాబోతోంది..
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?