AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘దళిత సాధికారత’ పథకంలో కీలక మార్పు..

Telangana Govt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న ‘దళిత సాధికారత’ పథకానికి కీలక మార్పులు చేసింది.

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘దళిత సాధికారత’ పథకంలో కీలక మార్పు..
Cm Kcr
Shiva Prajapati
|

Updated on: Jul 18, 2021 | 9:09 PM

Share

Telangana Govt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న ‘దళిత సాధికారత’ పథకానికి కీలక మార్పులు చేసింది. ఈ పథకానికి.. ‘తెలంగాణ దళిత బంధు’ అనే పేరును పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ పేరును సూచిస్తూ ఖరారు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయనున్న ఈ పథకాన్ని మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ప్రారంభించాని ప్రభుత్వం నిర్ణయిచింది. ఆదివారం నాడు ఈ పథకానికి సంబంధించి పలువురు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కాగా, ఈ పథకంలో అమలులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాగా, సీఎం కేసీఆర్ గతంలోనూ అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను ఆయన ఫాలో అవుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన ‘సింహగర్జన సభ’ మొదలుకొని, తాను ఎంతగానో అభిమానించిన ‘రైతు బీమా’ పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన ‘రైతుబంధు’ పథకాన్ని కూడా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని సీఎం కొనసాగిస్తూ…‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రాంరంభోత్సవ తేదీని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.

Also read:

Telangana: ఎవరితో శత్రుత్వం లేదు.. తెలంగాణకు నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం.. కేంద్రానికి స్పష్టం చేసిన టీఆర్ఎస్..

భారత స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీపై కన్నేసిన టెక్నో మొబైల్‌ సంస్థ.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో విడుదల

Viral Video: బాలయ్య పాటా మజాకా.. వర్షంలో అదిరిపోయే స్టెప్పులతో దుమ్ము రేపిన తాత.. చూస్తే ఫిదా అయిపోతారంతే..