AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఎలుగుబంటి.. వారం రోజుల పాటు నరకయాతన చూసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Viral Video: సోషల్ మీడియాలో వింత వింత వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియో షాకింగ్‌గా అనిపిస్తే..

Viral Video: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఎలుగుబంటి.. వారం రోజుల పాటు నరకయాతన చూసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Bear
Shiva Prajapati
|

Updated on: Jul 18, 2021 | 10:08 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో వింత వింత వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియో షాకింగ్‌గా అనిపిస్తే.. మరికొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో అవి చేసే అల్లరి పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఇదిలాఉంటే.. ఇళ్ల మధ్య తిరిగే కుక్కలు, కోతులు, కోళ్లు ప్లాస్టిక్ డబ్బాలలో తలపెట్టి ఇరుక్కుపోవడం, గిన్నెలలో తల పెట్టి ఇరుక్కుపోవడం వంటి ఘటనలను చాలాసార్లే చూశాం. అయితే, తాజాగా ఓ ఎలుగుబంటి కూడా అదే పరిస్థితిన ఎదుర్కొంది. ఎరక్కపోయి ఇరుక్కోపోయింది.

ప్లాస్టిక్ డబ్బాలో తల దూర్చడంతో అదికాస్తా.. ఇరుక్కుపోయింది. బయటకు రాకపోవడంతో నానా అవస్థలు పడింది. ఆఖరికి తినడానికి, తాగడానికి కూడా తిప్పలు పడింది. దాదాపు వారం రోజులుగా ఆ ఎలుగుబంటి దీనంగా అలాగే తిరుగుతూ ఉండిపోయింది. అయితే, ఈ ఎలుగు బంటిని గమనించిన ప్రజలు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీమ్ ఆ ఏలుగుబంటికి మత్తుమందు ఇచ్చి.. దాని తలకు ఇరుక్కోపోయిన ప్లాస్టిక్ డబ్బాను తొలగించారు. అనంతరం దానికి స్వేచ్ఛను కల్పించారు. కాగా, ఈ ఘటన అంతా అమెరికాలోని కొలరాడోలో చోటు చేసుకుంది.

ప్లాస్టిక్ డబ్బాలో ఇరుక్కుపోయిన ఎలుగుబంటిని కొలరాడో వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీమ్ రక్షిస్తుండగా తీసిన వీడియోను డ్రూ మెక్కోనాగీ, డేవ్ షెర్మాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వాస్తవానికి ఈ ఇద్దరు స్నేహితులు ప్లాస్టిక్ డబ్బాలో తల ఇరుక్కున్న ఎలుగుబంటిని మొదట గమనించారు. దాని అవస్థలను చూసి.. అది ఎక్కడెక్కడికి వెళ్తుందనే దానిపై ట్రాక్ చేశారు. ప్రజల సహాయంతో దానికి పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఆ ఎలుగుబంటి చెట్టు ఎక్కడంతో వారి ప్రయత్నం విఫలమైంది. ఆ తరువాత వైల్డ్ లైఫ్ అధికారులు వచ్చి దానిని రక్షించారు. తలకు ఇరుక్కున్న ప్లాస్టిక్ డబ్బాను తొలగించడంతో ఆ ఎలుగుబంటి పరుగులు తీసింది.

Viral Video:

Also read:

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘దళిత సాధికారత’ పథకంలో కీలక మార్పు..

Telangana: ఎవరితో శత్రుత్వం లేదు.. తెలంగాణకు నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం.. కేంద్రానికి స్పష్టం చేసిన టీఆర్ఎస్..

Viral Video: బాలయ్య పాటా మజాకా.. వర్షంలో అదిరిపోయే స్టెప్పులతో దుమ్ము రేపిన తాత.. చూస్తే ఫిదా అయిపోతారంతే..