AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs: రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్‌ దహనం.. ఇప్పటి వరకు 1493 మంది డ్రగ్‌ డీలర్లను అరెస్టు చేశాం: ముఖ్యమంత్రి

Drugs: అసోం రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు అసోం ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా గడిచిన రెండు నెలల్లో పోలీసులు పట్టుకున్న సుమారు రూ.163 కోట్ల.

Drugs: రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్‌ దహనం.. ఇప్పటి వరకు 1493 మంది డ్రగ్‌ డీలర్లను అరెస్టు చేశాం: ముఖ్యమంత్రి
Subhash Goud
|

Updated on: Jul 18, 2021 | 9:51 PM

Share

Drugs: అసోం రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు అసోం ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా గడిచిన రెండు నెలల్లో పోలీసులు పట్టుకున్న సుమారు రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్‌ను రెండు రోజులపాటు బహిరంగంగా దహనం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ డ్రగ్స్‌ను మంటల్లో వేసి కాల్చివేసేందుకు నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసింది ప్రభుత్వం. దిఫు, గోలాఘాట్‌ ప్రదేశాల్లో సీఎం హిమంత బిశ్వశర్మ మాదకద్రవ్యాలకు శనివారం బహిరంగంగా నిప్పంటించగా, మిగిలిన మాదకద్రవ్యాలను నాగావ్‌, హోజాయ్‌లలో ఆదివారం దహనం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ.. పోలీసుల చొరవతో గడిచిన రెండు నెలల్లో మేము రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాము. అయితే ఇది రాష్ట్ర నార్కోటిక్స్‌ మార్కెట్లో 20-30 శాతం మాత్రమే. రాష్ట్రంలో రూ.2000-3000 కోట్ల విలువైన నార్కోటిక్స్‌ మార్కెట్‌ ఉంటుంది. పొరుగు దేశాల నుంచి భారత భూభాగంలోకి మాదక ద్రవ్యాల రవాణా మార్గంగా మాత్రమే అసోం ఉందనుకున్నామని, తాజా పరిస్థితులు చూస్తే రాష్ట్రంలోని వేలాదిమంది యవత ఈ మత్తు పదార్థాలకు బానిసలైనట్టు గుర్తించినట్లు చెప్పారు. అయితే డ్రగ్స్‌ రవాణాను అరికట్టేందుకు పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చామని అన్నారు.

గోల్‌ఘాట్‌ వద్ద సుమారు రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్‌

గోల్‌ఘాట్‌ వద్ద సుమారు రూ.20 కోట్ల విలువైన 802 గ్రాముల హెరాయిన్, 1205 కిలోల గంజాయి, 3 కిలోల ఓపీయమ్‌, 2 లక్షలకుపైగా మాత్రలకు బహిరంగంగా నిప్పంటిస్తున్న దృశ్యాలను ట్విటర్లో హిమంత బిశ్వశర్మ పోస్టు చేశారు. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 1493 మంది డ్రగ్‌ డీలర్లను అరెస్టు చేయడం సహా.. 874 కేసులను నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో గడిచిన రెండు నెలల్లో 18.82 కిలోల హెరాయిన్‌, 7944.72 కిలోల గంజాయి, 1.93 కిలోల మార్ఫిన్‌, 3 కిలోల మెతంఫిటమిన్‌, 3,313 కిలోల ఓపీయమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ రవాణాపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెడుతోందని, ఎంతటి వారైనా ఇలాంటి దందాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ డ్రగ్స్‌ అక్రమ దందా రోజురోజుకు పెరిగిపోతుండటంతో పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చి పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇవీ కూడా చదవండి:

పోలవరం అంచనాల ఆమోదంలో ఉద్దేశపూర్వక జాప్యం.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రంపై వైసీపీ మండిపాటు

Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు.. 22 మంది మృతి.. మరో 24గంటలు భారీ వర్షం కురిసే అవకాశం..