IND vs SL, 1st ODI Preview: లంకతో తొలిపోరు నేడే.. కొత్త కెప్టెన్లతో బరిలోకి ఇరుజట్లు.. ఫేవరేట్‌గా శిఖర్ ధావన్ సేన!
ఎన్నో అవాంతరాల మధ్య శ్రీలంక, భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్ నేటి నుంచి (ఆదివారం) ప్రారంభంకానుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌లొ ఆకట్టుకునేందుకు టీమిండియా యంగ్ ప్లేయర్లు ఎదురుచూస్తున్నారు.
IND vs SL, 1st ODI Preview: ఎన్నో అవాంతరాల మధ్య శ్రీలంక, భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్ నేటి నుంచి (ఆదివారం) ప్రారంభంకానుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌లొ ఆకట్టుకునేందుకు టీమిండియా యంగ్ ప్లేయర్లు ఎదురుచూస్తున్నారు. అయితే, తొలిసారి ఇరుజట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్నాయి. శిఖర్ ధావన్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, షనక శ్రీలంక టీంకు సారథ్యం వహించనున్నాడు. ఇరుజట్లలో టీమిండియా చాలా బలంగా కనిపింస్తుండగా, శ్రీలంక మాత్రం అగ్రశ్రేణి ప్లేయర్లు తప్పుకోవడంతో.. బలహీనంగా కనిపిస్తోంది. శ్రీలంకతో సిరీస్ కోసం 20 మందితో టీమ్‌ను ప్రకటించింది టీమిండియా మేనేజ్‌మెంట్. రాహుల్ ద్రవిడ్ శిక్షణతో రాటుదేలింది టీమిండియా. కాగా, కెప్టెన్ ధావన్‌తో పాటు భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, చహల్ చాలాకాలంగా ప్రధాన జట్టులో భాగమై ఉన్నారు. తుది జట్టులో వీరంతా ఉండనున్నారు. యువ ఆటగాళ్లలో ఎవరికి అవకాశం లభిస్తుందోనని అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. యువ ఆటగాళ్లకు ఐపీఎల్ అనుభవం ఉండటంతో అంతర్జాతాయ క్రికెట్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. ఓపెనర్‌గా పృథ్వీ షాకు జట్టులో చోటు లభించే ఛాన్స్ ఉంది. అలాగే మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌కు అవకాశం రావొచ్చు. కీపర్‌గా ఇషాన్ కిషన్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపిస్తోంది.
మరోవైపు శ్రీలంక పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. దసున్ షనక గత నాలుగేళ్లలో ఆ జట్టుకు పదో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కుశాల్ మెండిస్, డిక్‌వెలా సస్పెన్షన్‌లో ఉన్నారు. వీరు బయో బబుల్ రూల్స పాటించలేదనే కారణంగా వేటు పడింది. కుశాల్ పెరీరా గాయంతో, మాథ్యూస్ వ్యక్తిగత కారణాలతో భారత్ సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో యువ ఆటగాళ్లు ఎలా ఆడతారోనని ఆందోళన చెందుతున్నారు లంక అభిమానులు.
ఎప్పుడు: జులై 18, 2021, మధ్యాహ్నం 3 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఎక్కడ: ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో
వాతావరణం: ఆదివారం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఆటకు మధ్యలో ఆటంకం కలిగే అవకాశం ఉంది.
టీంల వివరాలు: టీమిండియా: శిఖర్ ధావన్ తొలిసారిగా టీమిండియాకు సారథిగా వ్యవహరించనున్నాడు. జట్టులో మొత్తం 20 మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో కొంతమందికి టీమిండియా టోపీలను అందించే అవకాశం ఉంది. తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కొంతమందికి అవకాశం దొరకనున్నట్లు తెలుస్తోంది.
భారత్ ఎలెవన్: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక: శ్రీలంక టీంను ముందుకు నడింపిచందే బాధ్యతను దసున్ షనకకు అప్పగించారు. అనేక మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో… శ్రీలంక టీం చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఏంజెలో మాథ్యూస్ వ్యక్తిగత కారణాలతో టీమిండియాతో సిరీస్‌కు దూరమయ్యాడు. కుసల్ పెరెరా, బినురా ఫెర్నాండో గాయాల కారణంగా ఈ సిరీస్‌లో ఆడడం లేదు.
శ్రీలంక ఎలెవన్: అవిష్కా ఫెర్నాండో, మినోడ్ భానుకా (వికెట్ కీపర్), పట్టుమ్ నిస్సంకా, ధనంజయ డి సిల్వా, భానుకా రాజపక్సే, వనిండు హసరంగ, దసున్ షనక (కెప్టెన్), చమికా కరుణరత్నే, అకిలా ధనంజయ, దుష్మంత చమీక
మీకు తెలుసా?
– భారత్, శ్రీలంక టీంలు వరుసగా 37వ సంవత్సరాలపాటు ప్రతీ ఏడాది ఏదో ఒక సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచులోనైనా తలపడుతూనే ఉన్నాయి. కాగా, 1983వ సంవత్సరంలో ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్‌లో కూడా తలపడలేదు.
– శ్రీలంక, భారత్ జట్లు ఇప్పటి వరకు 159 వన్డేలలో తలపడ్డాయి.
– 3-0, 2-0 లేదా 2-1 తేడాతో టీమిండియా గెలిస్తే శ్రీలంకతో వన్డేల్లో 93 విజయాలు నమోదు చేసినట్లు అవుతోంది. దాంతో లంక టీంపై అత్యధిక విజయాలు నమోదు చేసిన టీంగా భారత్ అవతరించనుంది.
Just 1⃣ sleep away from the series opener ? ?
ARE YOU READY to cheer for #TeamIndia❓#SLvIND pic.twitter.com/5B15ywqPPx
— BCCI (@BCCI) July 17, 2021
Also Read: