Viral Video: స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న వెస్టిండీస్ ప్లేయర్.. షాకవుతూ పెవిలియన్ చేరిన ఆరోన్ ఫించ్.. వైరలవుతోన్న వీడియో!

Venkata Chari

Venkata Chari |

Updated on: Jul 18, 2021 | 6:40 AM

గత రెండు వారాలుగా క్రికెట్ చరిత్రలో కొన్ని అద్భుతమైన క్యాచులు అలరిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ క్యాచ్ ఆస్ట్రేలియాకు మరో ఓటమిని అందించగా, వెస్టిండీస్‌కు అద్భుత విజయాన్ని అందించింది.

Viral Video: స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న వెస్టిండీస్ ప్లేయర్.. షాకవుతూ పెవిలియన్ చేరిన ఆరోన్ ఫించ్.. వైరలవుతోన్న వీడియో!
Aus Vs Wi Fabian Allen

WI vs AUS: గత రెండు వారాలుగా క్రికెట్ చరిత్రలో కొన్ని అద్భుతమైన క్యాచులు అలరిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ క్యాచ్ ఆస్ట్రేలియాకు మరో ఓటమిని అందించగా, వెస్టిండీస్‌కు అద్భుత విజయాన్ని అందించింది. శుక్రవారం ఆసీస్‌తో జరిగిన ఐదవ టీ20లో ఫాబియెన్ అలెన్‌ మరో సూపర్ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకుని ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ను వెస్టిండీస్ బౌలర్ హెడెన్‌ వాల్ష్‌ వేశాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆరోన్‌ ఫించ్‌ క్రీజులో పాతుకపోయాడు. భారీ షాట్లతో ఆడుతున్న అతను మరో షాట్‌ను లాంగాన్‌ మీదుగా ఆడాడు. అందరూ సిక్స్ అని అనుకుంటుంగా ఫ్రేమ్‌లోకి ఫాబియెన్‌ అలెన్‌ ఎంటరయ్యాడు. పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేస్తూ ఎడమ చేత్తో బాల్‌ను అందుకున్నాడు. అరోన్ ఫించ్‌ షాకవుతూ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. అలెన్‌ మూడో టీ20లోనూ స్టన్నింగ్ క్యాచ్ అందుకొని హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐసీసీ కూడా ఫాబియెన్ అలెన్‌ క్యాచ్‌లను సోషల్ మీడియాలో పంచుకుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య జరిగిన టీ20 సిరీస్‌లోనూ డియోల్ అద్భుత క్యాచ్‌కు ప్రధాని మోడీ కూడా ఫిదా అయిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ విషయానికి వస్తే.. వరుసగా మూడు మ్యాచులు గెలిచిన వెస్టిండీస్ టీం నాలుగవ మ్యాచులో పరాజయం పాలైంది. ఇక ఐదవ వన్డే వెస్టిండీస్‌ విజయం సాధించి 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఎవిన​ లూయిస్‌ 79 పరుగులతో (34 బంతులు; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పూరన్‌ 31, గేల్‌ 21, సిమన్స్‌ 21 ఆకట్టుకున్నారు. 200పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా టీం నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో 16 పరుగుల తేడాతో వెస్టిండీస్ అద్భుత విజయం సాధించింది. ఆసీస్ ఆటగాళ్లలో ఆరోన్‌ ఫించ్‌ 34, మిచెల్‌ మార్ష్‌ 30 పరుగులతో నిలిచారు.

Also Read:

World Record: వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్ మ్యాజిక్ రిపీట్.. 6 బంతుల్లో 36 పరుగులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu