IND vs SL: భారత్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు ప్రకటన..! నూతన కెప్టెన్‌గా దసున్ షనక ఎంపిక!
భారత్, శ్రీలంక టీంల మధ్య రెండు రోజుల్లో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఈమేరకు టీమిండియాతో తలపడే లంక టీంను శ్రీలంక బోర్డు ప్రకటించింది. జులై 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.
IND vs SL: భారత్, శ్రీలంక టీంల మధ్య రెండు రోజుల్లో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఈమేరకు టీమిండియాతో తలపడే లంక టీంను శ్రీలంక బోర్డు ప్రకటించింది. జులై 18 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. శ్రీలంక సెలెక్టర్లు ఆల్‌రౌండర్ దసున్ షనకను కెప్టెన్‌గా నియమించింది. రెగ్యులర్ కెప్టెన్ వెటరన్ కుసాల్ పెరీరా భుజం గాయం కారణంగా టీమిండియాతో జరిగే సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇటీవల ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన శ్రీలంక టీంలో బ్యాటింగ్ కోచ్, డేటా అనలిస్ట్‌లకు కరోనా సోకింది. దీంతో వన్డే సిరీస్ అలస్యంగా ప్రారంభిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన టీంలో పెద్దగా మార్పులు కనిపించడలేదు. ఇంగ్లండ్ వెళ్లిన టీంనే బరిలోకి దించనున్నారు. వన్డే, టీ20లకు ఇదే జట్టు ఆడనుంది.
కెప్టెన్సీలో మార్పు.. శ్రీలంక టీంలో పెద్ద మార్పు అంటే కెప్టెన్సీ. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన కెప్టెన్ కుసాల్ పెరీరా స్థానంలో ఆల్ రౌండర్ దసున్ షనకకు కొత్తగా సారథ్య బాధ్యతలు అప్పగించారు. పెరీరీ వన్డే, టీ20 సీరిస్‌ల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈ ఆల్ రౌండర్‌కు అవకాశం దక్కింది. గత నాలుగు సంవత్సరాలలో శ్రీలంకకు 10వ కెప్టెన్‌గా దసున్ షనక వ్యవహరించనున్నాడు. కాగా, టీమిండియా కూడా కొత్త కెప్టెన్‌తోనే బరిలోకి దిగనుండడం విశేషం.
వన్డే, టీ20 సిరీస్‌లకు శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), ధనంజయ్ డిసిల్వ (వైస్ కెప్టెన్), పాటం నిసాంకా, అవిష్కా ఫెర్నాండో, భానుకా రాజపక్సే, చరిత్ అసాలంకా, వనిండు హసరంగ, అషేన్ భండారా, మినోద్ భానుకా, లాహిరు ఉదారా, రమేష్ మెండినా, చమీఖ్ ధమంతమత్ చమి అకిలా ధనంజయ్, శిరాన్ ఫెర్నాండో, ధనంజయ్ లక్షన్, ఇషాన్ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రమ, అసితా ఫెర్నాండో, కసున్ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదనా.
Sri Lanka ?? squad for the 3-match ODI series & the 3-match T20I series against India ?? – https://t.co/qVd9nJxpau#SLvIND pic.twitter.com/9gqEGVlM79
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) July 16, 2021
Also Read: