- Telugu News Photo Gallery Cricket photos Icc t20 world cup 2021 india and pakistan will face off in group stage a look at previous results
ICC T20 World Cup 2021: దాయాదుల పోరులో టీమిండియాదే పైచేయి.. 5 విజయాలతో పాకిస్తాన్‌పై ఆధిపత్యం.. మరోసారి ఆసక్తి రేపుతోన్న గ్రూప్ 2!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త రానే వచ్చింది. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2021 కోసం ఐసీసీ తాజాగా గ్రూపులను ప్రకటించింది.
Updated on: Jul 16, 2021 | 9:39 PM

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త రానే వచ్చింది. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2021 కోసం ఐసీసీ తాజాగా గ్రూపులను ప్రకటించింది. సూపర్ -12 లో గ్రూప్ -2 ఎంతో ఆసక్తిని కలిగించనుంది. టీమిండియా, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండడంతో.. అందరూ ఈ పోటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ప్రతీసారి టీమిండియానే పైచేయి సాధించింది. ఇందులో కూడా 4 సార్లు గ్రూప్ దశలోనే తలపడ్డారు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు గ్రూపు దశలో తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 141 పరుగులు చేసింది. పాకిస్తాన్ కూడా అద్భుతంగా ఆడడంతో మ్యాచ్ టై అయింది. దీంతో రిజల్ట్ బాలౌట్ కు చేరింది. ఇందులో ముగ్గురు భారత బౌలర్లు వికెట్ పడగొట్టారు. పాకిస్తాన్ మాత్రం వికెట్ పడగొట్టడంలో విఫలం కావడంతో టీమిండియానే గెలిచింది.

2007 టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌లో మరోసారి తలపడ్డారు. ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 157 పరుగులు సాధించింది. పాకిస్తాన్ కూడా లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చింది. కానీ, చివరి ఓవర్లో జోగిందర్ శర్మ మాయాజాలంతో టీమిండియా విజయం సాధించింది.

2012 లో జరిగిన టీ 20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ మూడోసారి తలపడ్డాయి. గ్రూప్ -2 మ్యాచ్‌లో లక్ష్మీపతి బాలాజీ 3, యువరాజ్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ తో రెండ వికట్లు పడగొట్టడంతో పాకిస్తాన్‌ను 128 పరుగులకే కట్టిడి చేసింద టీమిండియా. అనంతరం చేధనలో యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి 78 పరుగుల అజేయంగా ఇన్నింగ్స్‌తో టీమిండియా మరోసారి విజయం సాధించింది.

2014 టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ మరోసారి గ్రూప్ -2 లో తలపడ్డాయి. భారత బౌలర్లు పాకిస్థాన్ టీంను 130 స్కోరుకే పరిమితం చేశారు. ఛేదనలో విరాట్ కోహ్లీ (36), సురేష్ రైనా (35) లతో చెలరేగడంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.

2016 టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఐదవసారి తలపడ్డాయి. ఈ ప్రపంచ కప్ భారతదేశంలోనే జరిగింది. ఈ మ్యాచుకు చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా మారింది. 18 ఓవర్ల ఈ మ్యాచ్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌ను కేవలం 118 పరుగులకు కట్టడి చేసింది. ఛేదనలో విరాట్ కోహ్లీ కేవలం 37 బంతుల్లో 55 పరుగులతో అజేయ ఇన్నింగ్స్‌తో వరుసగా ఐదవ విజయాన్ని భారత్‌కు అందించాడు.




