Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2021: 40 ఏళ్ల కల నెరవేరేనా.. భారత పురుషుల హాకీ జట్టుపై భారీ అంచనాలు!

ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్లు ఇప్పటి వరకు ఎనిమిది బంగారం, ఒక వెండి, రెండు రజత పతకాలను గెలుచుకుంది. అయితే ఇది గత చరిత్ర. ప్రస్తుతం హాకీ టీం పతకం గెలుచుకోవడంలో వరుసగా విఫలమవుతోంది.

Tokyo Olympics 2021: 40 ఏళ్ల కల నెరవేరేనా.. భారత పురుషుల హాకీ జట్టుపై భారీ అంచనాలు!
Hockey Team India
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 11:54 AM

Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్లు ఇప్పటి వరకు ఎనిమిది బంగారం, ఒక వెండి, రెండు రజత పతకాలను గెలుచుకుంది. అయితే ఇది గత చరిత్ర. ప్రస్తుతం హాకీ టీం పతకం గెలుచుకోవడంలో వరుసగా విఫలమవుతోంది. చివరిసారి 1980 మాస్కో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. ఇక అప్పటి నుంచి మరో పతకం సాధించేందుకు నానా కష్టాలు పడుతోంది. 40 ఏళ్లుగా భారత్‌కు పతకాన్ని అందించలేక చతికిలపడుతోంది. జపాన్ వేదికగా 1964లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు బంగారు పతకాన్ని సాధించింది. దీంతో మరోసారి జపాన్‌లో చరిత్రను తిరిగి రాయాలనే అంచనాలతో బరిలోకి దిగనుంది. మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో.. భారత పురుషుల హాకీ జట్టు నాలుగేళ్లుగా అప్రతిహాస విజయాలతో దూసుకపోతోంది. 2017 ఆసియా కప్ గెలిచిన తరువాత 2018లో ఏషియన్ చాంపియన్‌షిప్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అలాగే 2019 ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్‌లోనూ విజయం సాధించింది. 2018 వరల్డ్‌కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రస్తుత భారత పురుషుల జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. దీంతో హాకీ టీంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, మొత్తం 16 మంది ఆటగాళ్లలో 10 మందికి ఇవే తొలి ఒలింపిక్స్ కావడంతో.. ఎలా ఆడతారోననే సందేహాలు ఉన్నాయి. కెప్టెన్ మన్‌ప్రీత్‌ కెరీర్‌లో మూడోసారి ఒలింపిక్స్ ఆడుతున్నాడు. ఆయనతోపాటు సీనియర్లు రూపిందర్ పాల్, సురేందర్‌ కుమార్, మన్‌దీప్ సింగ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వీరు మిగతా ప్లేయర్లను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంద. జూనియర్లు ఒత్తిడిని అధిగమిస్తేనే భారత హాకీ జట్టు పతకం సాధించేందుకు బరిలో నిలవగలదు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్పెయిన్, జపాన్‌తో కలిసి భారత్ పూల్-ఎలో తలపడనుంది.

ఇక పురుషుల జట్టుతో పోలిస్తే భారత మహిళ హాకీ జట్టుపై అంచనాలు లేవు. భారత మహిళల జట్టుకు ఇవి మూడో ఒలింపిక్స్. 36 ఏళ్ల తరువాత రియో ఒలింపిక్స్‌లో ఆడిన భారత మహిళలు.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. భారత మహిళలు ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు చేరడంతోపాటు కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో ఆకట్టుకున్నారు. నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, సౌతాఫ్రికతో భారత్‌ తలపడనుంది. దాంతో టోక్యోలో ఎలా రాణిస్తుందో చూడాలి.

భారత హాకీ జట్లు మహిళలు: గుర్జిత్‌ కౌర్‌, దీప్‌ గ్రేస్‌, నిక్కీ ప్రధాన్‌, ఉదిత (డిఫెండర్లు), మోనిక, నిశ, సుశీల, నవ్‌జోత్‌, సలీమ, నేహ (మిడ్‌ఫీల్డర్లు), రాణి రాంపాల్‌ (కెప్టెన్‌), షర్మిల, వందన, లాల్‌రెమ్‌సియామి, నవ్‌నీత్‌ (ఫార్వర్డ్‌), సవిత (గోల్‌కీపర్‌).

పురుషులు: హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, రూపిందర్‌ సింగ్‌, సురేందర్‌ కుమార్‌, అమిత్‌, బిరేంద్ర (డిఫెండర్లు), హార్దిక్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), వివేక్‌ సాగర్‌, నీలకంఠ శర్మ, సుమిత్‌ (మిడ్‌ఫీల్డర్లు), షంషేర్‌ సింగ్‌, దిల్‌ప్రీత్‌ సింగ్‌, గుర్జాంత్‌ సింగ్‌, లలిత్‌ కుమార్‌, మన్‌దీప్‌ సింగ్‌ (ఫార్వర్డ్‌), పీఆర్‌ శ్రీజేష్‌ (గోల్‌కీపర్‌).

Also Read:

IND vs SL: భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు ప్రకటన..! నూతన కెప్టెన్‌గా దసున్‌ షనక ఎంపిక!

ICC T20 World Cup 2021: దాయాదుల పోరులో టీమిండియాదే పైచేయి.. 5 విజయాలతో పాకిస్తాన్‌పై ఆధిపత్యం.. మరోసారి ఆసక్తి రేపుతోన్న గ్రూప్ 2!