World Record: వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్ మ్యాజిక్ రిపీట్.. 6 బంతుల్లో 36 పరుగులు..
John Glass Smashes 6 Sixes: పొట్టి క్రికెట్‌లో సంచలనాలు నమోదు కావడం సర్వసాధారణం. ఓడిపోతుందని అనుకునే జట్టు అనూహ్యంగా గెలవచ్చు. అదే విధంగా..
పొట్టి క్రికెట్‌లో సంచలనాలు నమోదు కావడం సర్వసాధారణం. ఓడిపోతుందని అనుకునే జట్టు అనూహ్యంగా గెలవచ్చు. అదే విధంగా ఓటమి అంచుల్లో ఉన్న జట్టు విజయమూ సాధించవచ్చు. టీ20 క్రికెట్ అంటేనే ఇది. జనాలకు నరాలు తెగే ఉత్కంఠను ఇస్తుంది. తాజాగా ఇలాంటి సీన్ రిపీట్ అయింది. గెలవడానికి భారీ టార్గెట్ ఉండగా.. చివరి ఓవర్‌లో ఓ బ్యాట్స్‌మెన్ మ్యాజిక్ చేసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో 35 పరుగులు చేయాలి.! చేతిలో ఉన్నది మూడు వికెట్లు.! మాములుగా అయితే ఇది అసాధ్యం. అయితే ఆరు బంతుల్లో 6 సిక్సర్లు బాదితే.. నిజంగా అద్భుతమే అని చెప్పొచ్చు. క్రిస్ గేల్, సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ సృష్టించే మ్యాజిక్‌ను రిపీట్ చేసి ఓటమి అంచున ఉన్న టీమ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు బాలీమెనా బ్యాట్ప్‌మెన్ జాన్ గ్లాస్.
JOHN GLASS TAKE A BOW!
He has just hit 36 off the final over and Ballymena are the 2021 Lagan Valley Steels 2021 champions.
What an innings from the skipper. #ncut20t pic.twitter.com/afatC6Q7co
— Northern Cricket Union (@NCU_News) July 15, 2021
ఇర్లాండ్ ఎల్‌వీఎస్ టీ20 ఫైనల్ మ్యాచ్ క్రెగాగ్, బాలీమెనా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్రెగాగ్ జట్టు నిర్ణీత ఓవర్లకు 147 పరుగులు చేసింది. ఇక ఈ టార్గెట్‌ను చేధించే క్రమంలో బాలీమెనా 19 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉంది. చివరి ఓవర్‌కు 35 పరుగులు కావాల్సి ఉండగా.. గ్లాస్(87*) అద్భుతం చేశాడు. ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి తన జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఇదే మ్యాచ్‌లో గ్లాస్ సోదరుడు సామ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం.
Also Read:
గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!
తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!
చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!