Viral News: తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!
ఇంటి గోడలైనా..ప్రహరీ గోడలైనా, కోట గోడలైనా, టవర్ లైనా ఇటుకలతోనో..లేదా రాతితోనే కడతారు. లేదా వెదురు గడలతో నిర్మిస్తారు...
పురావస్తు శాఖ తవ్వకాల్లో 15వ శతాబ్దానికి చెందిన ఓ టవర్ బయటపడింది. దానిని చూసిన పరిశోధకులు ఒకింత షాక్‌కు గురయ్యారు. అదేంటి పాడుబడ్డ టవర్‌ను చూసి షాక్ కావడం ఏంటని అనుకోవచ్చు.? సాధారణంగా గోడలైనా, ప్రహరీ గోడలైనా, టవర్‌లైనా ఇటుకలతో నిర్మిస్తారు. కానీ తవ్వకాల్లో బయటపడిన ఆ టవర్ గోడల నిండా మనిషి పుర్రెలు ఉన్నాయి. ఇటుకల ప్లేస్‌లో పుర్రెలను చూసి పురావస్తు శాఖ పరిశోధకులు ఆశ్చర్యపోయారు. నరబలులు ఇచ్చి పుర్రెలతో టవర్ కట్టేశారా.? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
మెక్సికోలోని మెట్రోపాలిటన్ కేథడ్రల్ సమీపంలో పురావస్తు శాఖ పరిశోధకులు తవ్వకాలు జరపగా.. 15వ శతాబ‍్దం నాటి పురాతన టవర్ ఒకటి బయటపడింది. దాన్ని చూసి వారంతా షాకయ్యారు. అందుకు కారణం లేకపోలేదు. ఆ టవర్ నిండా మనిషి పుర్రెలు పేర్చి ఉన్నాయి. మహిళలు, పురుషులతో చిన్నారుల పుర్రెలు కూడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఏ దేవతనైనా పూజించి ఆ దేవతకు పూజ సందర్భంగా వీరందరిని బలి ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అలాగే వీరిలో ఎక్కువ మంది శత్రు సైనికులు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ పుర్రెల తలలను బట్టి..దంతాల సైజు ఆధారంగా ఈ పుర్రెల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ టవర్ గోడ 2017లోనే బయటపడిందని.. గతంలో కొన్ని పుర్రెలని గుర్తించగా.. ఇప్పుడు మరో 114 పుర్రెలు వెలుగులోకి వచ్చినట్లు ఆర్కియాలజిస్ట్‌లు తెలిపారు. అలా ఇప్పటి వరకు 600 వందల పుర్రెలు బయటపడ్డాయని తెలిపారు.
కాగా ఆయా పరిస్థితులను, చరిత్రను బట్టి అజ్టెక్ సామ్రాజ్యాధిపతి తన ప్రత్యర్థులను హెచ్చరించటానికి ఈ గోడ నిర్మించాడని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే..స్పానిష్ ఆక్రమణదారులు 1521లో అజ్టెక్ సామ్రాజ్యాన్ని కూలదోశారు. ఇక టవర్ గోడ నిర్మాణంలో వెలుగు చూసిన పుర్రెల్లో ఎక్కువ భాగం శత్రు సైనికులవి కాగా.. మరి కొన్ని సాధారణ ప్రజలవి అయి ఉండవచ్చని.. వీరందరిని దేవుడికి బలి ఇచ్చి ఉంటారని..ఈ గోడని 15వ శతాబ్దం చివర్లో నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఇది ఆధునిక మెక్సికో నగరంలోని చారిత్రాత్మక జిల్లా అజ్టెక్ రాజధాని టెనోచ్టిట్లాన్ ప్రధాన ఆలయాలలో ఒకటైన టెంప్లో మేయర్ ప్రాంతంలో ఉంది.
Also Read:
గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!
ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. దాన్ని గుర్తించడం చాలా కష్టం.. మీరు కనిపెట్టగలరా.?
వరల్డ్ స్నేక్ డే రోజు.. శ్రీవారి భక్తులకు భారీ నాగుపాము షాక్..!
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..