AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: వరల్డ్‌ స్నేక్‌ డే రోజు.. శ్రీవారి భక్తులకు భారీ నాగుపాము షాక్..!

తిరుమల పరిసర ప్రాంతాల్లో పాములు తరచూ జనావాసాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలు..

AP News:  వరల్డ్‌ స్నేక్‌ డే రోజు..  శ్రీవారి భక్తులకు భారీ నాగుపాము షాక్..!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 16, 2021 | 7:07 PM

తిరుమల పరిసర ప్రాంతాల్లో పాములు తరచూ జనావాసాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అసలే ఈరోజు వరల్డ్ స్నేక్ డే కావడంతో.. భక్తులను ఓ నాగుపాము ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. పాపవినాశనం మార్గంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ఓ భారీ నాగుపాము హల్‌చల్‌ చేసింది. స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో భక్తులు సేద తీరుతుండగా.. ఊహించని రీతిలో ఆ విషసర్పం గోడ కన్నం నుంచి బయటికి వచ్చింది. దానిని చూడగానే భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు కూడా ఘటనాస్థలానికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు.

కిచెన్‌లో వింత శబ్దాలు.. ఏంటని చూడగా.. షాకైన భార్యాభర్తలు..

విశాఖలోని నేవల్ క్వార్టర్స్‌లో ఓ నాగుపాము కలకలం రేపింది. యారడలోని డాల్ఫిన్స్ హిల్స్ కొండపై నేవీ ఉద్యోగులు నివసిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలోని ఒకరి ఇంటి కిచెన్‌లో నాగుపాము(కింగ్ కోబ్రా) తిష్ట వేసుకుని కూర్చుంది. ఆ ఇంటిలో నివసిస్తున్నవారు కిచెన్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని వెళ్లి చూడగా.. గట్టి షాక్ తిన్నారు. అక్కడ ఓ షెల్ఫ్‌లో పొడవైన నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది.

దీనితో ఆ ఇంటివారు ఇరుగుపొరుగు వారిని సహాయానికి పిలిచారు. వారిలో ఒకరు స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. అతడు అక్కడికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. దీనితో అందరూ హమ్మయ్య.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గతంలోనూ విశాఖలో పాములు హల్చల్ చేశాయి. సింధియా కూడలిలోని నేవల్ క్వార్టర్స్ వద్ద సుమారు 10 అడుగుల పొడువు ఉన్న బంగారు వర్ణంలోని త్రాచుపామును స్నేక్ క్యాచర్‌ పట్టుకుని బంధించాడు.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. దాన్ని గుర్తించడం చాలా కష్టం.. మీరు కనిపెట్టగలరా.?

జోరువానలో కల్లాపి చల్లుతున్న యువతి.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..