Telangana Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీని ఖరారు చేసింది. జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డులను..

Telangana Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..
Telangana Ration Card
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 15, 2021 | 8:14 PM

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీని ఖరారు చేసింది. జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకుని.. అర్హత పొందిన 3 లక్షల 60 వేలకు పైచిలుకు లబ్దిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జూలై 26 నుంచి 31వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త రేషన్‌కార్డుదారులకు ఆగష్టు నెల నుంచే రేషన్ బియ్యం అందజేస్తామని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌కు తెలియజేశామని ఆయన అన్నారు.

Also Read:

పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!

ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!