Viral Video: పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!

Viral Video: ఎంతటి బలవంతుడికైనా.. ఓ బలహీనత ఉంటుంది అంటే ఇదేనేమో. దొరికింది కదా అని ఏ జంతువును పడితే.. ఆ జంతువును వేటాడితే..

Viral Video: పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!
Python
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2021 | 5:46 PM

నీటిలో మొసలి రారాజు. నీళ్లలో దానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటారు. ఎంతటి బలమైన జంతువైనా నీళ్లలో మొసలికి తలవంచాల్సిందే. అందుకే మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. ఇంతటి బలశాలి అయిన మొసలికి ఊహించని పరిణామం ఎదురైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం…

ఎంతటి బలవంతుడికైనా.. ఓ బలహీనత ఉంటుంది అంటే ఇదేనేమో. దొరికింది కదా అని ఏ జంతువును పడితే.. ఆ జంతువును వేటాడితే.. ఇలాగే ప్రాణాల మీదకు వస్తుంది. ఓ కొండచిలువను నోట కరిచిన మొసలికి చుక్కలు కనిపించాయి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా అనకొండ లాంటి భారీ విషసర్పాల జోలికి క్రూర జంతువులు వెళ్ళవు. కానీ ఇక్కడొక మొసలి.. దొరికింది కదా అని భారీ పైథాన్ దగ్గరకు వెళ్లింది. అమాంతం దాని తలను గట్టిగా కొరికి పట్టుకుంది. ఇంకేముంది ఆ అనకొండ ఊరుకుంటుందా.! ఎదురుదాడికి దిగింది. ఆ మొసలిని చుట్టేసింది. దీనితో చేసేదేమీ లేక ఆ మొసలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వీరిద్దరి మధ్య సాగిన భీకర పోరాటంలో చివరికి కొండచిలువ పైచేయి సాధించింది. మొసలిని ఓడించి మింగేసింది. కాగా, ఈ వార్‌కు సంబంధించిన వీడియోను ‘Into The Wild’ అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు మూడు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. గుర్తుపట్టండి చూద్దాం.!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!