Viral Video: కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

పాములు ఎంత ప్రమాదకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాములను ఆమడదూరం నుంచి చూస్తే చాలు.. మనుషులు హడలిపోయి పరుగులు..

Viral Video: కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 12, 2021 | 3:43 PM

పాములు ఎంత ప్రమాదకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాములను ఆమడదూరం నుంచి చూస్తే చాలు.. మనుషులు హడలిపోయి పరుగులు పెడతారు. ఒకవేళ పాము గనక ఎదురుగా కనబడితే ఇక అంతే సంగతులు… గుండె ఝల్లుమంటుంది. ఇదిలా ఉంటే సాధారణంగా పాములు ఆహారంగా చిన్న జీవులను, కప్పలు, ఎలుకలు, గుడ్లు, కీటకాలను తింటుంటాయి. అలాగే పాములు ఏ ఆహారాన్ని అయినా కూడా మింగుతాయన్న విషయం తెలిసిందే.

సరిగ్గా ఇక్కడొక పాము కోళ్లను మింగేందుకు ప్రయత్నించింది. కానీ, పాము పాచికలు పారలేదు. దానికి అనూహ్యంగా షాక్ తగిలింది. ఓ గోరింక అకస్మాత్తుగా దానిపై మెరుపు దాడికి దిగింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో ఓ పాము కోళ్లను మింగేందుకు వచ్చింది. వాటి వెంటపడి దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే, అంతలోనే ఆ పామును చూసిన ఓ గోరింక.. రివ్వున నేలకు వాలింది. గాల్లో ఎగురుతూ ఆ విష సర్పాన్ని వెంబడించింది. ముక్కుతో పొడుస్తూ.. దాడిచేయటం మొదలు పెట్టింది. దీనితో గోరింక దెబ్బకు ఆ పాము తోక ముడుచుకోవాల్సి వచ్చింది. కోళ్ల జోలికి వెళ్లకుండా తుర్రుమని పరారైంది.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!

పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!